News December 19, 2024
మా నాన్నను లాగకండి: అశ్విన్
తన బిడ్డ అవమానాల్ని ఎదుర్కోలేక రిటైర్ అయ్యాడని <<14923590>>అశ్విన్ రవిచంద్రన్ తండ్రి వ్యాఖ్యానించిన<<>> సంగతి తెలిసిందే. ఆ విషయంపై అశ్విన్ తాజాగా ట్విటర్లో సరదాగా స్పందించారు. ‘మా నాన్నకు మీడియాతో ఎలా మాట్లాడాలన్న శిక్షణ లేదు. నాన్నా.. ఏంటిది? ఇలా ‘డాడ్ స్టేట్‌మెంట్’ సంస్కృతిని నువ్వు కూడా అనుసరిస్తావని అనుకోలేదు. అందరికీ నా విజ్ఞప్తి ఒకటే. ఆయన్ను క్షమించి, ఒంటరిగా వదిలేయండి’ అని ట్వీట్‌లో కోరారు.
Similar News
News January 13, 2025
జనవరి 13: చరిత్రలో ఈరోజు
1948: హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టారు
1879: లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ జననం
1919: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి జననం
1949: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ జననం
1995: సినీ నటుడు వైష్ణవ్ తేజ్ జననం
2014: తెలుగు సినిమా నటి అంజలీదేవి మరణం
News January 13, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News January 13, 2025
బాల మావయ్యకు హృదయపూర్వక అభినందనలు: లోకేశ్
‘డాకు మహారాజ్’ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో మంత్రి లోకేశ్ తన మామ, హీరో బాలకృష్ణ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆయన ఎనర్జీ, చరిష్మా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోందన్నారు. ఈ సినిమాకు విశేష స్పందన వస్తోందని, ప్రతిచోటా రికార్డులను బ్రేక్ చేస్తోందని పేర్కొన్నారు. బాలయ్య తెలుగు సినిమాకు కొత్త బెంచ్ మార్కులు సెట్ చేయడం చూస్తుంటే గర్వంగా ఉందన్నారు.