News November 28, 2024
బ్లాక్మెయిల్ చేసే వారికి భయపడొద్దు: TG పోలీస్

ప్రేమ, పెళ్లి పేరుతో బ్లాక్మెయిల్ చేసే వారికి భయపడొద్దని తెలంగాణ పోలీసులు సూచించారు. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో బెదిరించే వారిపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సోషల్ మీడియా వేదికగా యువతులకు అవగాహన కల్పిస్తున్నారు. బాధితులకు తాము అండగా ఉంటామని, వారి వివరాలు ఎక్కడా బహిర్గతం అవకుండా జాగ్రత్త తీసుకుంటామని తెలిపారు. 100కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News September 17, 2025
ప్రధాని మోదీకి ప్రముఖుల శుభాకాంక్షలు

PM మోదీకి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రజల సంక్షేమం, వికసిత్ భారత్ కోసం మీ సంకల్పం మాకు స్ఫూర్తి’ అని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘రాజకీయాలంటే సేవ అని, అధికారం కాదు త్యాగమని నేర్పిన ప్రధానికి హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని సంజయ్ అన్నారు. PM మోదీకి ఆయురారోగ్యాలు సిద్ధించాలని ఆకాంక్షిస్తూ LoP రాహుల్ గాంధీ, TG CM రేవంత్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
News September 17, 2025
కోళ్లలో పుల్లోరం వ్యాధి – లక్షణాలు

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.
News September 17, 2025
అధరాలు అందంగా ఉండాలంటే..

ముఖ సౌందర్యాన్ని పెంచడంలో పెదవులు కీలకపాత్ర పోషిస్తాయి. కానీ కొందరి పెదవులు నల్లగా ఉంటాయి. వీటిని ఎర్రగా మార్చుకోవడానికి కాస్త తేనె, దానిమ్మరసం కలిపి 5 నిమిషాలు ఫ్రిజ్లో పెట్టాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని పెదవులకు అప్లై చేసి, 15 నిమిషాల పాటు అలా వదిలెయ్యాలి. అది ఆరిన తర్వాత చల్లని నీటితో పెదవులను శుభ్రం చేసుకోవాలి. అలాగే గులాబీ రేకులు, పాలు కలిపిన పేస్ట్ పెదవులకు అప్లై చేసినా ఎర్రగా మారతాయి.