News August 31, 2024
ఫోన్లో ఈ 3 సెట్టింగ్స్ మర్చిపోవద్దు

3 సెట్టింగ్స్ చేసుకోవడం ద్వారా మీ స్మార్ట్ ఫోన్లను చోరీ నుంచి రక్షించుకోవచ్చు. ముందుగా డివైజ్ లాక్ తప్పనిసరి. తద్వారా దొంగ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేడు. ఆ తర్వాత ‘notification on lock screen’ ఆఫ్ చేయండి. దీంతో పాటు ‘find my device’ ఎనేబుల్ చేయండి. ఈ సెట్టింగ్స్ చేశాక ఎప్పుడైనా మీ ఫోన్ కనిపించకపోతే వేరే డివైజ్లో మీ మెయిల్తో లాగిన్ అయ్యాక గూగుల్లో ‘android/find’ అని వెతికితే లొకేషన్ కనిపిస్తుంది.
Similar News
News November 26, 2025
నల్గొండ: పంచాయతీ ఎన్నికలపై సన్నద్ధత

నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా అధికారులతో సమావేశమై పలు అంశాలపై పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News November 26, 2025
బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన పాకిస్థాన్

యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్థాన్ మిలిటరీ ప్రకటించింది. ‘స్థానికంగా నిర్మించిన నేవల్ ప్లాట్ఫామ్ నుంచి మిస్సైల్ పరీక్షించాం. సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. ఇందులో అత్యాధునిక గైడెన్స్ వ్యవస్థలు ఉన్నాయి’ అని పేర్కొంది. కాగా మే నెలలో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పాకిస్థాన్ ఈ తరహా ప్రయోగాలను పెంచింది.
News November 26, 2025
పుల్లోరం వ్యాధితో కోళ్లకు ప్రమాదం

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.


