News November 13, 2024

ఉద్యోగ వేటలో ఇవి మరవొద్దు!

image

నైపుణ్యలేమి, రెజ్యూమ్ సరిగ్గా లేకపోవడంతో చాలామంది ఉద్యోగాలు పొందట్లేదు. ఈక్రమంలో గూగుల్‌ లేదా స్నేహితుడి రెజ్యూమ్‌ను కాపీ చేయడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పూర్తిగా అవగాహన ఉన్నదాని గురించి మాత్రమే రెజ్యూమ్‌లో పొందుపరచాలంటున్నారు. ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యామని వెనక్కి తగ్గకుండా అడిగిన ప్రశ్నలపై ప్రిపేర్ అవ్వాలని, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలంటున్నారు. ముఖ్యంగా భయపడొద్దని సూచిస్తున్నారు.

Similar News

News December 5, 2024

జూడాలకు 15 శాతం గౌరవ వేతనాలు పెంపు

image

AP: జూనియర్ వైద్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి గౌరవ వేతనాలను 15 శాతం పెంచుతూ వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులిచ్చారు. పెంచిన జీతాలు ఈ ఏడాది జనవరి నుంచి వర్తిస్తాయని పేర్కొన్నారు. రెసిడెంట్ స్పెషలిస్టులకు ₹70వేల నుంచి ₹80,500, రెసిడెంట్ డెంటిస్ట్‌లకు ₹65వేల నుంచి ₹74,750, రెసిడెంట్ సూపర్ స్పెషలిస్టులకు ₹85వేల నుంచి ₹97,750ల వరకు జీతాలు పెరిగాయి.

News December 5, 2024

దేవేంద్రుడి పట్టాభిషేకం నేడే

image

మహారాష్ట్ర CMగా దేవేంద్ర ఫడణవీస్ ఇవాళ సా.5.30 గం.కు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన CMగా బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఫడణవీస్‌తో పాటు Dy.CMగా అజిత్ పవార్ ప్రమాణం చేస్తారు. అయితే డిప్యూటీ పోస్ట్ తీసుకోవడానికి ఏక్‌నాథ్ శిండే వెనుకాడుతున్నారు. ఆయన ప్రమాణం చేస్తారా? లేదా? అనేది సాయంత్రం తేలనుంది.

News December 5, 2024

రైల్వే ప్రయాణికులకు తీపి వార్త

image

ఇకపై ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో 4 జనరల్ బోగీలు జత చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన LHB కోచ్‌లు వీటికి అనుసంధానం చేస్తున్నట్లు వెల్లడించింది. ఒక్కో బోగీలో వంద మంది ప్రయాణించవచ్చని పేర్కొంది. మొత్తం 370 రైళ్లలో వీటిని అందుబాటులోకి తెస్తున్నామని, లక్ష మంది అదనంగా ప్రయాణించవచ్చని వివరించింది. వీటిల్లో ప్రమాదాలు జరిగినా తక్కువ నష్టం కలుగుతుందని పేర్కొంది.