News September 21, 2024

రాజకీయాలొద్దు.. చేతనైతే విచారణ చేయించండి: బొత్స

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంలో వేగంగా విచారణ జరిపి నిజాలు తేల్చాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ‘రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవద్దు. చేతనైతే విచారణ జరిపించాలి, అంతేగాని రాజకీయం చేయవద్దు. దేవుడికి అపచారం చేస్తే ఎప్పటికైనా శిక్ష పడుతుంది. ప్రజల మనోభావాలతో రాజకీయాలు సమంజసం కాదు. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం’ అన్నారు.

Similar News

News December 9, 2025

ఈ రోజుల్లో స్కూళ్లకు హాలిడేస్

image

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 10, 11 తేదీల్లో పోలింగ్ కేంద్రాలుగా ఉన్న స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. అలాగే పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 11న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని పలు జిల్లాల కలెక్టర్లు ఆదేశించారు. రెండో దశ పోలింగ్ జరిగే 14న ఆదివారం, 13న రెండో శనివారం, మూడో దశ ఎన్నికలు జరిగే 17వ తేదీతో పాటు 16న కూడా స్కూళ్లకు సెలవులు ఇవ్వనున్నారు.

News December 9, 2025

నెలసరిలో నడుంనొప్పి ఎందుకు?

image

నెలసరిలో చాలామందికి నడుంనొప్పి వస్తుంది. నెలసరిలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి గర్భాశయం లైనింగ్ తొలగించి, గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తాయి. ఈ సంకోచాల కారణంగా నడుం కండరాలపై ప్రభావం చూపుతుంది. అలాగే ఎండోమెట్రియోసిస్ అనేది గర్భాశయం కణజాలంలో ఉంటుంది. ఇలా అసాధారణ కణజాల పెరుగుదల వల్ల నెలసరి సమయంలో నడుం నొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

News December 9, 2025

శంషాబాద్‌కు మరో బాంబు బెదిరింపు మెయిల్

image

TG: ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపు మెయిల్స్ ఆగడం లేదు. తాజాగా శంషాబాద్ విమానాశ్రయానికి మరో బెదిరింపు మెయిల్ వచ్చింది. అమెరికాకు వెళ్లే విమానంలో బాంబు ఉందని, పేలుడు జరగకుండా ఉండాలంటే మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎయిర్‌పోర్టు అంతటా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ మెయిల్ అమెరికాకు చెందిన జాస్పర్ పంపినట్లు ప్రాథమికంగా గుర్తించారు.