News January 20, 2025
ఈ సమయంలో బయటకు రాకండి: డాక్టర్లు

తెలంగాణలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మధ్యాహ్నం ఎండ, వేడి ఎక్కువగా ఉంటే.. ఉదయం, రాత్రి విపరీతమైన చలి ఉంటోంది. పగలు, రాత్రి మధ్య ఉష్ణోగ్రతల్లో తేడా 18 డిగ్రీల వరకు ఉంటోంది. ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న అత్యల్పంగా 6.5 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి.
Similar News
News February 8, 2025
కేజ్రీవాల్ ఓటమికి 2 కారణాలు: పీసీసీ చీఫ్

BRSతో స్నేహం, కాంగ్రెస్‌తో పొత్తు తెంచుకోవడం వల్లే ఆప్ ఓడిపోయిందని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ కూతురు కవితతో లిక్కర్ వ్యాపారం ఆరోపణలు కేజ్రీవాల్ పతనానికి పునాదులు వేశాయని చెప్పారు. అవినీతిరహిత నినాదంతో కేజ్రీవాల్ దేశస్థాయిలో ఇమేజ్ తెచ్చుకున్నారని, కానీ లిక్కర్ స్కాం దానికి తూట్లు పొడిచిందన్నారు. ఇక కాంగ్రెస్‌తో పొత్తు వద్దన్న ఆయన నిర్ణయం బీజేపీ నెత్తిన పాలు పోసిందని పేర్కొన్నారు.
News February 8, 2025
టెన్త్ అర్హతతో 1,124 ఉద్యోగాలు

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో 1,124 ఖాళీలకు మార్చి 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్/డ్రైవర్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టులున్నాయి. టెన్త్ పాసై డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, 21-27 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. ఫిజికల్ టెస్ట్, రాత పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.21,700-రూ.69,100 వరకు ఉంటుంది.
వెబ్‌సైట్: <
News February 8, 2025
SA20: సన్ రైజర్స్ హ్యాట్రిక్ కొడుతుందా?

సౌతాఫ్రికా లీగ్ 20 తుది అంకానికి చేరింది. కావ్య మారన్‌కు చెందిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్, ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ నేడు టైటిల్ కోసం తలపడనున్నాయి. రషీద్ సారథ్యంలోని కేప్ టౌన్ టైటిల్‌పై కన్నేయగా ఈస్టర్న్ కేప్ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. ఇవాళ రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్‌తో పాటు డిస్నీ+హాట్ స్టార్‌లో ప్రసారం కానుంది.