News March 26, 2025
మధ్యాహ్నం బయటకు రాకండి.. ప్రభుత్వం సూచన

TGలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ప్రయాణాలు చేసే సమయాల్లో నీరు, ORS వెంట ఉంచుకోవాలని, దాహం లేకున్నా నీటిని తాగాలని సూచించింది. వీలైనంత వరకు శరీరాన్ని కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలని, కళ్లజోడు, క్యాప్ పెట్టుకోవాలని తెలిపింది. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలంది. మ.12-3 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లొద్దని పేర్కొంది.
Similar News
News April 23, 2025
నేడు అర్ధరాత్రి ఓటీటీలోకి ‘ఎంపురాన్’

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ‘L2: ఎంపురాన్’ మూవీ ఇవాళ అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. జియో హాట్‌స్టార్‌లో తెలుగుతోపాటు మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో ప్రసారం కానుంది. మార్చి 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ.280 కోట్ల కలెక్షన్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. అలాగే మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగానూ రికార్డు సృష్టించింది.
News April 23, 2025
ట్రెండింగ్: ఇషాన్ కిషన్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు

IPL: MIతో మ్యాచ్‌లో ఒక్క పరుగుకే ఔట్ అయిన ఇషాన్ కిషన్‌పై SMలో ఫిక్సింగ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. బ్యాట్‌కు బంతి తగలకుండానే ఔట్ అయినట్లు భావించి పెవిలియన్‌కు <<16194207>>చేరడమే<<>> దీనికి కారణం. బౌలర్, కీపర్, ఫీల్డర్లెవరూ అప్పీల్ చేయకుండానే క్రీజు నుంచి వెళ్లిపోవడంపై క్రీడాభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. BCCI తిరిగి ఇతనికి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వడం దండగ అని సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి.
News April 23, 2025
పాకిస్థాన్‌కు భారత్ బిగ్ షాక్

పాక్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేసిన నేపథ్యంలో పాక్‌లోని చాలా ప్రాంతాలు ఎడారిలా మారే ఆస్కారముంది. భారత్, పాక్ మధ్య 1960లో సింధు జలాల ఒప్పందం జరిగింది. ఈ మేరకు సింధు, చీనాబ్, జీలం నదుల నీటిని పాక్ ఉపయోగించుకునే అవకాశం లభించింది. వ్యవసాయం, గృహావసరాలకు ఈ నదులపైనే ఆ దేశం ఆధారపడుతోంది. సింధుకు ఉప నదులైన చీనాబ్, జీలం భారత్‌లో పుట్టగా, చైనాలో జన్మించిన సింధు..IND నుంచి పాక్‌లోకి ప్రవహిస్తుంది.