News February 15, 2025
భారత క్రికెటర్లను హగ్ చేసుకోవద్దు: పాక్ అభిమానులు

ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో పాకిస్థాన్ ప్లేయర్లకు ఆ దేశ అభిమానులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 23న భారత్, పాక్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీతో పాటు టీమ్ ఇండియా క్రికెటర్లను హగ్ చేసుకోవద్దని సందేశాలు పంపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. భారత్, పాక్ మ్యాచ్ అనగానే ఇరుదేశాల అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంటుందన్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ వార్నింగ్ నేపథ్యంలో ఆటగాళ్లు ఏవిధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Similar News
News March 26, 2025
అప్సర హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు

TG: సంచలనం రేపిన <<10880696>>అప్సర<<>> హత్య కేసులో రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఆమెను హత్య చేసిన నిందితుడు పూజారి సాయికృష్ణకు జీవితఖైదు విధించింది. కొన్నేళ్లుగా అప్సర అనే మహిళతో వివాహేతర సంబంధం నడిపిన సాయికృష్ణ 2023లో ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మ్యాన్‌హోల్‌లో పడేసి, అప్సర కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడిపై అనుమానం రావడంతో దర్యాప్తు చేపట్టగా సాయికృష్ణే నిందితుడని తేలింది.
News March 26, 2025
రామ్ చరణ్ అభిమానులకు సూపర్ న్యూస్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ‘RC16’ సినిమా నుంచి అప్డేట్ రానుంది. ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు అప్డేట్ ఇస్తామని మేకర్స్ ప్రకటించారు. రేపు చరణ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ వీడియో వచ్చే అవకాశం ఉన్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
News March 26, 2025
వాషింగ్టన్ సుందర్‌పై స్పందించిన గూగుల్ సీఈఓ

వాషింగ్టన్ సుందర్‌ను గుజరాత్ టైటాన్స్ తుది జట్టులోకి తీసుకోకపోవడంపై గూగుల్ CEO సుందర్ పిచాయ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇండియా టీమ్‌లో ఉన్న సభ్యుడికి IPL తుది జట్టులో చోటు కల్పించరా అని ఒక అభిమాని Xలో పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన సుందర్ పిచాయ్ నాకూ అదే ఆశ్చర్యంగా ఉందని రిప్లై ఇచ్చారు. GT-PBKS మధ్య జరిగిన మ్యాచులో పంజాబ్ జట్టు 243పరుగుల లక్ష్యాన్నినిర్దేశించగా GT స్వల్ప తేడాతో ఓడిపోయింది.