News April 16, 2025

చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దు.. సుప్రీంకోర్టు సీరియస్

image

TG: హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయింది. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఆదేశించింది. అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు, పొదలు తొలగించామని ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని, చెట్ల పునరుద్ధరణపై ప్రణాళికతో రావాలని స్పష్టం చేసింది.

Similar News

News November 27, 2025

నెల్లూరు జిల్లాకు మరోసారి భారీ వర్షం..!

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈనెల 29, 30 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిన నేపథ్యంలో ఈ ప్రభావం నెల్లూరు జిల్లాపై ఉండనున్నట్లు అధికారులు ప్రకటించారు. రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News November 27, 2025

వికారాబాద్‌ జిల్లాలో భూప్రకంపనలు

image

TG: వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పూడూరు మండలం రాకంచెర్లలో సెకను పాటు భూమి కంపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్లు గ్రామానికి చేరుకుని ఆరా తీస్తున్నారు.

News November 27, 2025

ధాన్యం కొనుగోళ్లపై వైసీపీ అబద్ధాలు: నాదెండ్ల

image

AP: రైతులకు నష్టం లేకుండా ధాన్యం కొంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 24 గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్పారు. అయినా YCP నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ₹1,674 కోట్లు బకాయిలు పెట్టి పారిపోయిన వాళ్లా రైతుల పక్షాన మాట్లాడేదని మండిపడ్డారు. 8.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. దళారులను నమ్మి రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని కోరారు.