News April 16, 2025
చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దు.. సుప్రీంకోర్టు సీరియస్

TG: హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయింది. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఆదేశించింది. అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు, పొదలు తొలగించామని ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని, చెట్ల పునరుద్ధరణపై ప్రణాళికతో రావాలని స్పష్టం చేసింది.
Similar News
News April 25, 2025
సమ్మర్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బీర్ల సేల్స్

TG: రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు రెట్టింపయ్యాయి. సమ్మర్ సీజన్‌కు తోడు ఐపీఎల్ ఉండటంతో రోజుకు 3లక్షల బీర్ల కేసులు అమ్ముడుపోతున్నట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. IPL ప్రారంభమైన మార్చి 22వరోజు ఏకంగా 4లక్షల కాటన్‌ల బీర్లు సేల్ అయినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. పెరిగిన డిమాండ్ తీర్చడానికి బీర్ సరఫరా సంస్థలు సైతం ఉత్పత్తిని పెంచాయి. లిక్కర్ అమ్మకాలతో ప్రభుత్వ ఖజానాకు భారీగానే ఆదాయం రానుంది.
News April 25, 2025
చెపాక్‌లో SRHకు కష్టమే?

ఈరోజు CSKvsSRH మ్యాచ్‌లో ఓడిన జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. చెన్నై కంటే రైజర్స్‌కే ఓటమికి అవకాశాలెక్కువ ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. చెపాక్‌లో SRH చెత్త రికార్డే దీనిక్కారణం. ఆ స్టేడియంలో సన్‌రైజర్స్ 12 మ్యాచులాడితే రెండింటిలోనే గెలిచింది. మొత్తంగా IPLలో చెన్నైపై 22 మ్యాచులు ఆడిన హైదరాబాద్ 6సార్లు మాత్రమే విన్ అయింది.
News April 25, 2025
పోప్ అంత్యక్రియల్లో పాల్గొననున్న రాష్ట్రపతి

ఈనెల 21న కన్నుమూసిన పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరుకానున్నారు. ఇవాళ వాటికన్ సిటీ వెళ్లనున్న ఆమె రేపు అంత్యక్రియల్లో పాల్గొంటారని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. భారత ప్రభుత్వం, ప్రజల తరఫున సంతాపం తెలుపుతారని వెల్లడించింది.