News December 6, 2024

పోలీస్ స్టేషన్లలో హడావుడి చేసేవారిని వదిలిపెట్టొద్దు: రేవంత్

image

TG: ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే క్రిమినల్స్‌తో ఫ్రెండ్లీగా ఉండటం కాదని CM రేవంత్ వ్యాఖ్యానించారు. పోలీసులంటే నేరగాళ్ల వెన్నులో వణుకు పుట్టాలన్నారు. స్టేషన్లకు వచ్చి హడావుడి చేసే వాళ్లను వదిలిపెట్టొద్దని ఆదేశించారు. ఇటీవల బంజారాహిల్స్ పీఎస్‌లో హల్‌చల్ చేసిన BRS MLA పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశిస్తూ సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కౌశిక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News February 5, 2026

350 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

image

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 350 పోస్టులకు అప్లై చేయడానికి గడువును పొడిగించారు. అర్హతగల వారు ఫిబ్రవరి 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి CFA/CA, MBA, PGDBM, PGDBA, CAIIB, IIBF, CITF, NISM సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం ఉండాలి. FEO పోస్టుకు గరిష్ఠ వయసు 35ఏళ్లు కాగా, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టుకు 30ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://centralbank.bank.in

News February 5, 2026

AP EAPCET రిజిస్ట్రేషన్లు షురూ

image

జేఎన్‌టీయూ కాకినాడ నిర్వహించే AP EAPCET-2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఏప్రిల్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో మరికొన్ని రోజులు అవకాశం ఉంటుంది. మే 12, 13, 14, 15, 18 తేదీల్లో ఇంజినీరింగ్, మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్&ఫార్మసీ పరీక్షలు జరుగుతాయి. అలాగే ఏపీ ఈసెట్ రిజిస్ట్రేషన్లు కూడా మొదలయ్యాయి. ఏప్రిల్ 23న ఎగ్జామ్ నిర్వహిస్తారు.

News February 5, 2026

వరుసగా మూడు రోజులు స్కూళ్లకు సెలవులు?

image

TG: వచ్చే వారంలో వరుసగా 3రోజులు స్కూళ్లకు సెలవు ఉండే అవకాశం ఉంది. ఈ నెల 13న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో పాఠశాలలకు హాలిడే ఇచ్చే ఛాన్స్ ఉంది. దీనిపై అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది. ఇక 14న రెండో శనివారం, 15న ఆదివారం కావడంతో వరుసగా సెలవులు రానున్నాయి. కాగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తవ్వగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో 11న ఎలక్షన్ జరగనుంది.