News December 6, 2024
పోలీస్ స్టేషన్లలో హడావుడి చేసేవారిని వదిలిపెట్టొద్దు: రేవంత్

TG: ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే క్రిమినల్స్‌తో ఫ్రెండ్లీగా ఉండటం కాదని CM రేవంత్ వ్యాఖ్యానించారు. పోలీసులంటే నేరగాళ్ల వెన్నులో వణుకు పుట్టాలన్నారు. స్టేషన్లకు వచ్చి హడావుడి చేసే వాళ్లను వదిలిపెట్టొద్దని ఆదేశించారు. ఇటీవల బంజారాహిల్స్ పీఎస్‌లో హల్‌చల్ చేసిన BRS MLA పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశిస్తూ సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కౌశిక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 16, 2026
వెల్లుల్లి రోజూ తింటే ఇన్ని లాభాలా..!

వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే కాంపౌండ్ బీపీని తగ్గించి గుండెను పదిలంగా ఉంచుతుందని డాక్టర్లు సూచిస్తున్నారు. డైజెషన్ మెరుగుపడటంతో పాటు ఇమ్యూనిటీ పెరుగుతుంది. బాడీలోని వ్యర్థాలను తొలగించి రక్తంలో షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సహజసిద్ధమైన ఈ సూపర్ ఫుడ్ క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచీ రక్షణనిస్తుంది. వండటం వల్ల పోషకాలు నశిస్తాయి. పచ్చిగా తింటేనే పూర్తి ప్రయోజనం ఉంటుంది.
News April 16, 2026
బంగ్లాదేశ్ క్రికెటర్ రుబెల్ రిటైర్మెంట్

బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ రుబెల్ హుస్సేన్(36) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ జట్టు తరఫున 27 టెస్టులు, 104 వన్డేలు, 28 టీ20లు ఆడి 193 వికెట్లు పడగొట్టారు. 2021 ఏప్రిల్‌లో న్యూజిలాండ్‌తో ఆడిన టీ20 మ్యాచే ఆయనకు చివరిది. గాయాలతో అప్పటి నుంచి జట్టుకు దూరమవుతూ వచ్చారు. ఇక వన్డేల్లో అరంగేట్రంలోనే 4 వికెట్లు తీసిన తొలి బంగ్లాదేశ్ బౌలర్‌గా రుబెల్ పేరిట రికార్డ్ ఉంది.
News April 16, 2026
పెద్ది రిలీజ్ డేట్ అందుకే ప్రకటించలేదా?

రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’ రిలీజ్‌ను సినిమా యూనిట్ జూన్‌కు వాయిదా వేసింది. కానీ డేట్‌ను మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికే 2సార్లు పోస్ట్‌పోన్ అయిన నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని టాక్. జూన్ 4న యశ్ నటించిన ‘టాక్సిక్’ రిలీజ్ కానుంది. అది కూడా వాయిదా పడే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో క్లాష్ అవ్వకుండా ప్లాన్ చేయాలని పెద్ది యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.


