News September 8, 2024
వారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు.. బ్రిజ్ భూషణ్‌కు బీజేపీ హుకుం
కాంగ్రెస్‌లో చేరిన రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియాను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని WFI మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ను BJP ఆదేశించినట్టు తెలుస్తోంది. రెజ్లర్లపై వేధింపుల ఆరోపణల వెనక కాంగ్రెస్ కుట్ర ఉందని, దీనికి హరియాణా EX CM భూపిందర్ సింగ్ హుడా పథక రచన చేశారని బ్రిజ్ భూషణ్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వినేశ్, బజరంగ్‌పై వ్యాఖ్యలు మానుకోవాలని BJP ఆదేశించడం గమనార్హం.
Similar News
News October 7, 2024
మళ్లీ పుట్టినట్లుగా ఉంది: వరుణ్ చక్రవర్తి
మూడేళ్ల తర్వాత టీమ్ ఇండియా తరఫున ఆడటం మళ్లీ పుట్టినట్లుగా ఉందని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అన్నారు. ఇది తనకు ఎమోషనల్ మూమెంట్ అని పేర్కొన్నారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ప్రదర్శన కాన్ఫిడెన్స్‌ను పెంచిందని వరుణ్ చెప్పారు. ఈ ప్రదర్శనను కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా బంగ్లాతో తొలి టీ20లో వరుణ్ మూడు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.
News October 7, 2024
అక్టోబర్ 7: చరిత్రలో ఈరోజు
1708: సిక్కుల చివరి గురువు గురు గోవింద సింగ్ మరణం
1885: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత నీల్స్ బోర్ జననం
1900: తెలుగు భాషా శాస్త్రవేత్త, కవి, కులపతి గంటి జోగి సోమయాజి జననం
1940: పండితులు, కవి, రచయిత కూచి నరసింహం మరణం
1979: మిస్ వరల్డ్ (1999), నటి యుక్తా ముఖీ జననం
News October 7, 2024
నోర్మూసుకుని కూర్చో: కమెడియన్‌తో ఓలా సీఈఓ
ఓలా బైక్స్‌ను విమర్శిస్తూ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన ట్వీట్‌పై ఆ సంస్థ సీఈఓ భవీశ్ అగర్వాల్ మండిపడ్డారు. అంత బాధగా ఉంటే వచ్చి హెల్ప్ చేయాలని సూచించారు. ‘వచ్చి మాకు సాయం చేయండి. మీ పెయిడ్ ట్వీట్ లేదా మీ విఫల కెరీర్ వల్ల మీకొచ్చేదాని కంటే ఎక్కువ జీతం ఇస్తా. లేదంటే నోర్మూసుకుని కూర్చోండి. నిజమైన వినియోగదారుల కోసం సమస్యల్ని సరిచేయనివ్వండి. మా సేవల్ని మరింత విస్తరిస్తున్నాం’ అని పేర్కొన్నారు.