News March 3, 2025

DON’T MISS.. పరీక్ష లేకుండా 21,413 ఉద్యోగాల భర్తీ

image

21,413 పోస్టుల భర్తీ కోసం భారత తపాలా శాఖ స్వీకరిస్తున్న దరఖాస్తుల గడువు మార్చి 3వ తేదీతో ముగియనుంది. బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్(రూ.12,000-29,380), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్(రూ.10,000-రూ.24,470) ఉద్యోగాలకు టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. APలో 1,215, TGలో 519 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 18 నుంచి 40 ఏళ్ల వారు అర్హులు. ఫీజు రూ.100. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

Similar News

News December 4, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.220 తగ్గి రూ.1,30,360కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.200 పతనమై రూ.1,19,500 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,000 తగ్గి రూ.2,00,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 4, 2025

పంట వ్యర్థాలను కలియదున్నితే కలదు లాభం

image

పంటకాలం పూర్తయ్యాక వ్యర్థాలను నేలలో కలియదున్నడం వల్ల సేంద్రీయ కర్బనశాతం పెరుగుతుంది. తర్వాతి పంట దిగుబడులు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశముంది. వ్యర్థాలను దుక్కి దున్నే సమయంలో నిపుణుల సూచనతో భూమిలో సూపర్‌ ఫాస్పెట్‌ చల్లితే అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా మారతాయి. ఫలితంగా డీఏపీ వాడకం సగం వరకు తగ్గుతుంది. పచ్చిరొట్టను కలియదున్నితే తర్వాత వేసే పంటకు అది ఎరువుగా మారి మంచి దిగుబడులు వస్తాయి.

News December 4, 2025

హనీమూన్ వెకేషన్‌లో సమంత-రాజ్!

image

ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత-రాజ్ పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. డిసెంబర్ 1న పెళ్లి చేసుకున్న ఈ జంట మరుసటి రోజే హనీమూన్‌కు గోవా వెళ్లినట్లు తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఈ కపుల్ వెళ్తున్న వీడియోలు వైరలయ్యాయి. కాగా 2 ఏళ్లకు పైగా రిలేషన్‌లో ఉన్న ఈ జోడీ కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లో ‘భూత శుద్ధి వివాహం’ పద్దతిలో ఒక్కటైన సంగతి తెలిసిందే.