News March 3, 2025
DON’T MISS.. పరీక్ష లేకుండా 21,413 ఉద్యోగాల భర్తీ

21,413 పోస్టుల భర్తీ కోసం భారత తపాలా శాఖ స్వీకరిస్తున్న దరఖాస్తుల గడువు మార్చి 3వ తేదీతో ముగియనుంది. బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్(రూ.12,000-29,380), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్(రూ.10,000-రూ.24,470) ఉద్యోగాలకు టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. APలో 1,215, TGలో 519 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 18 నుంచి 40 ఏళ్ల వారు అర్హులు. ఫీజు రూ.100. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <
Similar News
News March 22, 2025
నీటి ఉధృతితో సహాయక చర్యలకు ఆటంకం

TG: SLBC టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఊట నీటి ఉధృతి పెరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో కార్మికుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. అటు నిత్యం సహాయక చర్యలు కొనసాగేలా కార్మికుల పని షిఫ్టులను 3 నుంచి 5కు పెంచారు. 28 రోజుల కింద టన్నెల్‌లో 8 మంది గల్లంతు కాగా ఒకరి మృతదేహాన్ని ఇటీవల వెలికితీశారు. మరో ఏడుగురి ఆచూకీ లభించాల్సి ఉంది.
News March 22, 2025
IPL: ఆ రికార్డు బ్రేక్ చేసేదెవరో?

నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో కొన్ని రికార్డులు ఇంకా పదిలంగానే ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు(175), అత్యధిక సిక్సర్లు(357) విధ్వంసకర బ్యాటర్ గేల్ పేరిట ఉన్నాయి. సిక్సర్ల రికార్డుకు ఇతర ఆటగాళ్లు చాలా దూరంలో ఉన్నా అత్యధిక స్కోరు రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఇప్పుడున్న ప్లేయర్లలో ఏ ఆటగాడు ఆ రికార్డు బ్రేక్ చేస్తారని భావిస్తున్నారు? COMMENT.
News March 22, 2025
బ్యాంకుల సమ్మె వాయిదా

ఈనెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన బ్యాంక్ ఉద్యోగుల సమ్మెను వాయిదా వేస్తున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBU) ప్రకటించింది. వారంలో ఐదు రోజుల పని, అన్ని క్యాడర్లలో తగినన్ని నియామకాలు చేపట్టడం వంటి డిమాండ్ల విషయంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA), కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.