News August 27, 2024
నిర్లక్ష్యం చేయకండి!
ప్రస్తుతం డెంగ్యూ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రెండోసారి డెంగ్యూ బారిన పడటం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. వారిలో తీవ్రమైన కడుపు నొప్పి, నిరంతర వాంతులు, శ్వాస ఇబ్బందులు, చిగుళ్లు& ముక్కు నుంచి రక్తస్రావం, అలసట లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూ వైరస్ సోకిన ఆడ ఏడిస్ దోమలు కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది. సరైన చికిత్స ద్వారా రోగి ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు.
Similar News
News September 18, 2024
మీ నోటికి తాళం వేసుకోండి చంద్రబాబు: అంబటి రాంబాబు
AP: రాజధాని అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తే నోటికి తాళం వేస్తానన్న సీఎం చంద్రబాబు హెచ్చరికపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘ఈ ప్రజాస్వామ్యంలో ఎవరి నోటికి తాళాలు వేస్తారు? అక్రమంగా ఉన్న మీ ఇంటికి ముందు తాళం వేయండి. అప్పటి వరకు మీ నోటికి తాళం వేసుకోండి’ అని ట్వీట్ చేశారు.
News September 18, 2024
నెల్లూరులో జానీ మాస్టర్!
అసిస్టెంట్ డాన్సర్‌పై అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై నెల్లూరు పోలీసులను నార్సింగి పోలీసులు సంప్రదించారని సమాచారం. దీంతో జానీ మాస్టర్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశముంది.
News September 18, 2024
రాహుల్‌పై వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నిరసనలు
TG: మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి పట్టిన గతే రాహుల్ గాంధీకి పడుతుందన్న బీజేపీ నేత తన్వీందర్ సింగ్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలకు దిగింది. ధర్నాలు చేపట్టడంతో పాటు బీజేపీ నేతల దిష్టిబొమ్మలు దహనం చేయాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. హన్మకొండలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ధర్నాలో ఆయన మధ్యాహ్నం పాల్గొంటారు.