News July 11, 2024
‘లోన్ యాప్’ ఫోన్ వస్తే భయపడొద్దు: పోలీసులు

యాప్స్ నుంచి లోన్ తీసుకున్న వారిని, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులను ఏజెంట్ ఫోన్లు, మెసేజ్లతో వేధిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని తెలంగాణ పోలీసులు తెలిపారు. అలా ఎవరైనా ఫోన్ చేసినా, మెసేజ్‌లు పంపినా ఆందోళనకు గురికావొద్దంటున్నారు. ఫోన్ చేసి వేధిస్తుంటే వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. సమీపంలోని PSలో ఫిర్యాదు చేసినా సరిపోతుందని చెబుతున్నారు. >> SHARE
Similar News
News February 17, 2025
ముస్లింలను తొలగిస్తేనే ఆమోదిస్తాం: బండి సంజయ్

TG: రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందో కూలుతుందో తెలియడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. మంత్రులు 15% కమీషన్ దండుకుంటున్నారని, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందని ఆరోపించారు. ముస్లింలను BCల జాబితా నుంచి తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. కులగణన బిల్లు అలాగే పంపుతామంటే తామెందుకు ఆమోదిస్తామని, ముస్లింలను BCల జాబితా నుంచి తొలగించి పంపితే కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు.
News February 17, 2025
నా జీవితంలో అదే బెస్ట్ మూమెంట్: RCB కెప్టెన్

IPL మెగా వేలంలో ఫ్రాంచైజీ తనను కొనగానే టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ‘హలో ఐ యామ్ కోహ్లీ’ అంటూ మెసేజ్ చేసి అభినందించారని RCB కెప్టెన్ రజత్ పాటిదార్ తెలిపారు. అదే తన జీవితంలో బెస్ట్ మూమెంట్ అని పేర్కొన్నారు. ఆ క్షణంలో తాను అన్నీ సాధించినట్లు ఫీల్ అయ్యానని చెప్పారు. తానెప్పుడూ RCBకి ఆడాలని తహతహలాడుతుంటానని చెప్పారు. కాగా తమ జట్టు కెప్టెన్‌గా RCB పాటిదార్‌ను నియమించిన విషయం తెలిసిందే.
News February 17, 2025
Stock Markets: హమ్మయ్య.. నష్టాలకు తెర!

ఎట్టకేలకు నష్టాలకు తెరపడింది. స్టాక్‌మార్కెట్లు నేడు లాభపడ్డాయి. ఉదయం 180 Pts పతనమైన నిఫ్టీ 22,959 (+30), 600 pts కోల్పోయిన సెన్సెక్స్ 75,996 (+57) వద్ద ముగిశాయి. ఫార్మా, హెల్త్‌కేర్, బ్యాంకు, ఫైనాన్స్, మెటల్ షేర్లు ఇందుకు దన్నుగా నిలిచాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్. M&M, ఎయిర్‌టెల్, ఇన్ఫీ, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంకు టాప్ లూజర్స్.