News July 21, 2024
వందేమాతరం నినాదాలొద్దు: ఎంపీలకు సూచనలు
రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంపీలకు రాజ్యసభ సెక్రటేరియట్ పలు సూచనలతో హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసింది. సభ గౌరవాన్ని కాపాడాలని సభ్యులను అందులో కోరింది. ‘సభాపతి ఆదేశాలను విమర్శించొద్దు. సభామర్యాదను పాటించాలి. ఛైర్‌కు నమస్కరించే సంస్కృతిని కొనసాగించాలి. అభ్యంతరకరమైన భాషను నివారించాలి. సభ గంభీరత దృష్ట్యా వందేమాతరం, జైహింద్ సహా ఏ నినాదాలూ చేయొద్దు’ అని స్పష్టం చేసింది.
Similar News
News October 14, 2024
గాజా పరిస్థితులపై కమలా హారిస్ ట్వీట్
యుద్ధవాతావరణంతో గాజాలోని ప్రజలు ఆహారం అందక ఇబ్బందులు పడుతున్నారని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేర్కొన్నారు. ‘దాదాపు 2 వారాలుగా ఉత్తర గాజాలోకి ఎలాంటి ఆహారం వెళ్లలేదని UN నివేదించింది. అవసరమైన వారికి ఆహారం అందించేలా ఇజ్రాయెల్ అత్యవసరంగా యుద్ధాన్ని నిలిపివేయాలి. పౌరులను రక్షించాలి. ఆహారం, నీరు, మెడిసిన్స్ వారికి అందించాలి. మానవతా చట్టాన్ని గౌరవించండి’ అని ట్వీట్ చేశారు.
News October 14, 2024
తమిళనాడులో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూరు, సేలం జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. దీంతో పలు ప్రాంతాలు, గ్రామాలు జలమయం అయ్యాయి. వాహనాలు నీట మునిగాయి. కావేరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చెన్నై, కాంచీపురం, తిరువల్లూరుతో పాటు మరో 15 జిల్లాలకు అక్కడి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News October 14, 2024
జంగిల్ క్లియరెన్స్ తర్వాత అమరావతి ఇలా..
AP: అమరావతి నిర్మాణంపై కూటమి సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. ముందుగా జంగిల్ క్లియరెన్స్ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టిన ప్రభుత్వం దాదాపు పూర్తి చేసింది. దీంతో ఇప్పటివరకూ ముళ్ల కంపలు, పిచ్చి చెట్లతో చిన్నపాటి అడవిలా దర్శనమిచ్చిన ఆ ప్రాంతమంతా చూడచక్కగా కనిపిస్తోంది. ఇటు ప్రధాన రహదారులు, ఇతర నిర్మాణాలకు టెండర్లను సైతం డిసెంబర్‌లోపు ఖరారు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.