News February 4, 2025
పోలవరం కెపాసిటీ తగ్గించొద్దు: మిథున్ రెడ్డి

AP: పోలవరం ప్రాజెక్టు కెపాసిటీ తగ్గించవద్దని కేంద్రాన్ని YCP MP మిథున్ రెడ్డి కోరారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై లోక్‌సభలో ఆయన పాల్గొన్నారు. పోలవరంపై అన్యాయం జరిగితే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రాజెక్టు ఎత్తు 41.15మీటర్లకు తగ్గించడంతో కెపాసిటీ 194 నుంచి 115 TMCలకు పడిపోతుందని వివరించారు. దీని వల్ల 4.2 లక్షల ఎకరాలకు నీరు అందదని, ఈ అన్యాయాన్ని ఏపీ ప్రజలు క్షమించరని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News December 8, 2025
భారత్‌లో విమానయాన సంస్థలకు డిమాండ్: రామ్మోహన్ నాయుడు

భారత్‌లో విమాన సర్వీసులకు డిమాండ్ పెరుగుతోందని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు అన్నారు. డిమాండ్‌కు తగినట్టుగా కాంపిటీటర్స్ ఉండాలని, దేశంలో మరో 5 పెద్ద విమాన సంస్థల అవసరం ఉందని చెప్పారు. ఏవియేషన్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. <<18503378>>ఇండిగో సంక్షోభం<<>>పై చర్యలు తీసుకోవడంతోపాటు దానిని ఒక ఉదాహరణగా తీసుకుంటామని చెప్పారు.
News December 8, 2025
డబ్బు విలువ ఎందుకు తగ్గుతుందంటే?

ద్రవ్యోల్బణం వల్ల డబ్బు <<18505684>>విలువ<<>> ఎలా తగ్గుతుందనే డౌట్ చాలామందికి రావొచ్చు. ద్రవ్యోల్బణం అంటే వస్తు, సేవల ధరలు సాధారణంగా పెరగడం. దీని ఫలితంగా డబ్బుకున్న కొనుగోలు శక్తి కాలక్రమేణా తగ్గుతుంది. ఉదా.. 6% ద్రవ్యోల్బణం ఉంటే ఈ రోజు ₹100తో కొన్న వస్తువును భవిష్యత్తులో ₹106 పెట్టి కొనాల్సి వస్తుంది. అంటే మీ దగ్గరున్న డబ్బుతో గతంలో కొన్నంత ఎక్కువ వస్తువులను ఫ్యూచర్‌లో కొనలేరు. ఇలా డబ్బు విలువ తగ్గుతుంది.
News December 8, 2025
స్కూళ్లకు సెలవులపై ప్రకటన

TG: ఈ నెల 11న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో స్కూళ్లకు రెండు రోజులు సెలవు ఇస్తూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ జరిగే పాఠశాలలకు 10, 11న సెలవు ఉంటుందని పేర్కొన్నారు. 10న పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్ల దృష్ట్యా, 11న పోలింగ్ ఉండటంతో సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించారు. కాగా తొలి విడతలో 4,236 గ్రామాల్లో పోలింగ్ జరగనుండగా ఉపాధ్యాయులు విధుల్లో పాల్గొననున్నారు.


