News February 4, 2025
పోలవరం కెపాసిటీ తగ్గించొద్దు: మిథున్ రెడ్డి

AP: పోలవరం ప్రాజెక్టు కెపాసిటీ తగ్గించవద్దని కేంద్రాన్ని YCP MP మిథున్ రెడ్డి కోరారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై లోక్‌సభలో ఆయన పాల్గొన్నారు. పోలవరంపై అన్యాయం జరిగితే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రాజెక్టు ఎత్తు 41.15మీటర్లకు తగ్గించడంతో కెపాసిటీ 194 నుంచి 115 TMCలకు పడిపోతుందని వివరించారు. దీని వల్ల 4.2 లక్షల ఎకరాలకు నీరు అందదని, ఈ అన్యాయాన్ని ఏపీ ప్రజలు క్షమించరని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News February 12, 2026
త్వరలో మొబైల్ అంగన్‌వాడీలు.. ఇంటికే సరుకులు

TG: అర్హులందరికీ అంగన్‌వాడీ సేవలు అందేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఇందుకోసం మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. HYD, మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో ఈ వాహనాలను వినియోగించాలని నిర్ణయించారు. HMDA పరిధిలోని 274 బస్తీల్లో 25,310 మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు వీటి ద్వారా టేక్ హోం రేషన్ విధానంలో ఇళ్ల వద్దకే సరుకులు అందిస్తారు.
News February 12, 2026
ఇంటర్ పరీక్షల్లో అడిషనల్ ఆన్సర్ షీట్లు ఉండవు: బోర్డు

AP: ఇంటర్ పబ్లిక్ పరీక్షలు-2026లో విద్యార్థులకు అడిషనల్ ఆన్సర్ షీట్లను ఇవ్వబోమని బోర్డు ప్రకటించింది. ఫస్టియర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనమిక్స్, సివిక్స్, కామర్స్, హిస్టరీ సబ్జెక్టులకు 32 పేజీల ఆన్సర్ బుక్‌లెట్‌ను అందిస్తామంది. మిగతా ఫస్టియర్, బ్యాక్‌లాగ్ సబ్జెక్టులకు, సెకండియర్లోని అన్ని పేపర్లకు 24 పేజీల బుక్‌లెట్ ఇస్తామని తెలిపింది. పరీక్షలు ఉదయం 9-12 గంటల వరకు కొనసాగుతాయని పేర్కొంది.
News February 12, 2026
‘బంగారు తీగ’ కలుపుతో అపరాల పంటకు ముప్పు.. నివారణ ఎలా?

అపరాల పంటలకు బంగారు తీగ కలుపు ముప్పు ఎక్కువ. అందుకే పంట విత్తిన వెంటనే ఎకరాకు 200L నీటిలో పెండిమిథాలిన్ 30% 1.25 లీటర్లను కలిపి పిచికారీ చేయాలి. వరి మాగాణిలో మినుము విత్తితే వరి పనలు తీసిన వెంటనే ఎకరాకు 1.25L పెండిమిథాలిన్ 30%ను 20KGల ఇసుకలో కలిపి పొలంలో చల్లాలి. అలాగే మినుము విత్తిన 20 రోజులకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో ఇమజితాఫిర్ 10% 200mlను కలిపి పిచికారీ చేసి బంగారు తీగ కలుపును నివారించవచ్చు.


