News May 14, 2024

గాజాలో నరమేధం జరగుతోందని భావించడం లేదు: అమెరికా

image

గాజాలో నరమేధం జరుగుతున్నట్లు తాము భావించడం లేదని అమెరికా NSA సలివాన్ స్పష్టం చేశారు. అయితే, పాలస్తీనా పౌరుల్ని రక్షించేందుకు ఇజ్రాయెల్ మరింత కృషి చేయాలని ఓ ప్రెస్‌మీట్‌లో అభిప్రాయపడ్డారు. ‘పౌరుల విషయంలో ఇజ్రాయెల్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుందని మేం నమ్ముతున్నాం. హమాస్ ఓడిపోవాలనే బైడెన్ కోరుకుంటున్నారు. కానీ పాలస్తీనీయులు నరకయాతన అనుభవిస్తున్నారని కూడా ఆయన గుర్తించారు’ అని పేర్కొన్నారు.

Similar News

News March 4, 2026

సుప్రీంలీడర్‌ నియామకంపై వార్తలు.. స్పందించిన ఇరాన్

image

ఖమేనీ రెండో కొడుకు మొజ్తాబా ఖమేనీ <<19292894>>సుప్రీంలీడర్‌గా<<>> ఎన్నికైనట్లు వస్తున్న వార్తలను ఇరాన్ ఖండించింది. అందులో నిజం లేదని చెప్పింది. ‘ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఎంపిక చేసిన అభ్యర్థుల గురించి మీడియాలో వస్తున్న రిపోర్టులకు అధికారిక ఆధారాలు లేవు. వాటిని తిరస్కరిస్తున్నాం’ అని ముంబైలోని కాన్సులేట్ జనరల్ స్పష్టం చేసింది. మొజ్తాబాను సుప్రీం లీడర్‌గా ప్రకటించనున్నారని ఇజ్రాయెల్ మీడియా చెప్పింది.

News March 4, 2026

టీచర్ల జీతాలను ప్రభుత్వం తగ్గించదు: KK

image

TG: ప్రభుత్వ టీచర్ల జీతాలు తగ్గించాలంటూ విద్యాకమిషన్ సర్కారుకు నివేదిక ఇచ్చిందన్న వార్తలపై ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్ కే.కేశవరావు స్పందించారు. ప్రభుత్వం టీచర్ల జీతాలను తగ్గించదని స్పష్టం చేశారు. శాలరీలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఉపాధ్యాయ సంఘాలను పిలిచి మాట్లాడుతామని చెప్పారు. అన్ని జీవోలు పబ్లిక్ డొమైన్‌లో పెడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం నెల రోజుల్లో కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తెస్తుందని వివరించారు.

News March 4, 2026

రోజూ అత్యాచార బెదిరింపులు: ఆయేషా ఖాన్

image

తాను రోజూ ఆన్‌లైన్‌లో లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నట్లు ‘ధురంధర్’ స్పెషల్ సాంగ్ నటి ఆయేషా ఖాన్ వెల్లడించారు. తాను ఏం ధరించినా అసభ్య కామెంట్లు చేస్తారని, అత్యాచారం చేస్తామని బెదిరిస్తుంటారని వాపోయారు. సమాజంలో ఇదొక ప్రమాదకర వైఖరని పేర్కొన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఈమె తెలుగులో ముఖచిత్రం, ఓం భీమ్ బుష్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మనమే, జాట్ చిత్రాల్లో నటించారు.