News March 18, 2025
కసాయి వాళ్లను నమ్మకండి.. బీసీ నేతలతో సీఎం

TG: బీసీలకు 42% రిజర్వేషన్లపై బిల్లును ప్రవేశపెట్టినందుకు బీసీ సంఘాల నాయకులు సీఎం రేవంత్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘బీసీ కులగణన చేయాలనేది రాహుల్ గాంధీ ఆలోచన. మీరు కృతజ్ఞతలు చెప్పాల్సింది ఆయనకే. 10 లక్షల మందితో రాహుల్కు కృతజ్ఞత సభ పెట్టండి. సర్వేలో పాల్గొనని వారిని వెళ్లి కలుస్తున్నారు. ఆ కసాయి వాళ్లను నమ్మకండి’ అని సూచించారు.
Similar News
News March 19, 2025
రేపు విశాఖలో వైసీపీ ధర్నా

AP: విశాఖలోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియం పేరును తొలగించడాన్ని నిరసిస్తూ రేపు నగరంలో వైసీపీ ధర్నాకు పిలుపునిచ్చింది. ‘వైజాగ్ ప్రగతికి రాచబాటలు వేసిన వైఎస్సార్ను కూటమి ప్రభుత్వం తీవ్రంగా అవమానించింది. ఆయన ఆనవాళ్లను చెరిపేసేలా సర్కారు చేస్తున్న కుట్రను ప్రజలకు తెలియజెప్పేందుకు రేపు వైఎస్ అభిమానులు, పార్టీ నాయకులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు’ అని ట్వీట్ చేసింది.
News March 19, 2025
సిద్దరామయ్య ఫ్లైట్ జర్నీకి రూ.31 కోట్లు.. తీవ్ర విమర్శలు

రెండేళ్లలో కర్ణాటక CM సిద్దరామయ్య విమాన ప్రయాణానికి రూ.31 కోట్లు ఖర్చు చేశారు. దీనిపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేస్తోంది. ఢిల్లీకి రానుపోనూ విమాన ఛార్జీ రూ.70 వేలకు మించదని, అలాంటిది ఛార్టర్ ఫ్లైట్లో వెళ్తూ ఒక ట్రిప్కే రూ.44.40 లక్షలు వృథా చేస్తున్నారని మండిపడుతోంది. రూ.10.85 లక్షలు ఖర్చు చేసి బెంగళూరు నుంచి మైసూరుకు కూడా హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నారని విమర్శిస్తోంది.
News March 19, 2025
క్రేన్ వక్కపొడి: 40KGల బంగారం, 100 KGల వెండి స్వాధీనం?

AP: గుంటూరులోని క్రేన్ వక్కపొడి కంపెనీ ఛైర్మన్ కాంతారావు నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారులు 2 రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 40 కేజీల బంగారం, 100 కేజీల వెండి, రూ.18 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సంస్థలో భారీగా నల్లధనం చేరుతున్నట్లు ఐటీ శాఖ అనుమానిస్తోంది. లావాదేవీలపై స్పష్టత కోసం కీలక డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.