News April 23, 2025

ఆ సమయంలో ఫోన్ వాడకండి!

image

వేసవి కావడంతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎలక్ట్రానిక్ డివైజ్‌లు పేలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మనం నిత్యం వాడే సెల్‌ఫోన్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఎండలో బయటికి వెళ్లినప్పుడు వేడికి ఫోన్లు ఓవర్ హీట్ అవుతాయి. ఆ సమయంలో మొబైల్‌కు అలర్ట్ మెసేజ్ కూడా వస్తుంది. అప్పుడు ఫోన్ వాడకూడదు. చల్లగా ఉండే ప్రదేశానికి తీసుకెళ్లి, బ్యాటరీ కూల్ అయ్యాకే వినియోగించాలి.

Similar News

News August 9, 2025

రాఖీ కట్టని కవిత, షర్మిల

image

తెలుగు రాష్ట్రాల్లో క్రియాశీలక నేతలుగా ఉన్న కవిత, షర్మిల తమ సోదరులకు ఈ ఏడాది రాఖీ కట్టలేదు. ప్రతి ఏటా తమ అనుబంధాన్ని చాటే కేటీఆర్-కవిత ఈ సారి వేడుకలకు దూరంగా ఉన్నారు. కేటీఆర్ కూడా అందుబాటులో లేరని తెలుస్తోంది. మరోవైపు మాజీ సీఎం జగన్‌, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మధ్య రాజకీయ వైరంతో దూరం పెరిగింది. దీంతో గతేడాది మాదిరే ఇవాళ కూడా జగన్‌కు షర్మిల రాఖీ కట్టలేదు.

News August 9, 2025

ఒక్క విమానమూ కూలలేదు: పాక్ రక్షణ మంత్రి

image

ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌కు చెందిన 6 విమానాలను <<17350664>>కూల్చేశామని<<>> IAF చీఫ్ మార్షల్ AP సింగ్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఖండించారు. ‘ఒక్క పాక్ విమానాన్నీ ఇండియా కూల్చలేదు. 3 నెలల నుంచి వారేం మాట్లాడలేదు. కానీ మేము ఇంటర్నేషనల్ మీడియాకు అన్నీ వివరించాం. ఒకవేళ నమ్మకం లేకుంటే దీనిపై స్వతంత్ర విచారణ జరిపించాలి. అయినా భారత్ నిజాన్ని బయటకి రానివ్వదు’ అని వ్యాఖ్యానించారు.

News August 9, 2025

ట్రంప్, పుతిన్ భేటీ.. స్వాగతించిన భారత్

image

US, రష్యా ప్రెసిడెంట్స్ ట్రంప్, పుతిన్ ఈ నెల 15న అలాస్కాలో భేటీ కానున్న విషయం తెలిసిందే. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ‘US, రష్యన్ ఫెడరేషన్ అలాస్కాలో సమావేశమయ్యేందుకు ముందుకు రావడాన్ని ఇండియా స్వాగతిస్తోంది. ఈ భేటీతో యుద్ధానికి తెరపడి ఉక్రెయిన్‌‌లో శాంతికి దారులు తెరుచుకునే అవకాశం ఉంది. ఇది యుద్ధాల యుగం కాదని PM మోదీ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు’ అని ఓ ప్రకటన విడుదల చేసింది.