News March 26, 2024
ధోనీలా చేయాలనుకోకు.. హార్దిక్‌కు షమీ చురకలు

గుజరాత్‌తో మ్యాచులో హార్దిక్ కెప్టెన్సీపై షమీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ధోనీలా 7వ ప్లేస్‌లో వచ్చి మ్యాచును ముగించడం అందరికీ సాధ్యంకాదు. ధోనీ ఎప్పటికీ ధోనీనే. అతడిలా ఎవరూ సరితూగరు. గతంలో హార్దిక్ 4,5 లేదా 5వ స్థానంలో బ్యాటింగ్ చేశారు. కానీ MI తరఫున 7వ ప్లేస్‌లో వచ్చారు. అలా వస్తే తనపై తానే ఒత్తిడి పెంచుకున్నట్లవుతుంది. పాండ్య ముందుగా వచ్చి ఉంటే మ్యాచ్ అంతవరకు వచ్చేది కాదు’ అని షమీ చురకలు అంటించారు.
Similar News
News February 8, 2026
13.06% పెరిగిన SBI లాభం

SBI బ్యాంకు లాభం 13.06% పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం DEC క్వార్టర్‌లో రూ.21,028 కోట్ల నికర లాభాన్ని పొందింది. మొత్తం ఆదాయంలో 9.7%వృద్ధి సాధించింది. ఏకీకృత అకౌంట్ల ప్రకారం నికర లాభం రూ.21,317 కోట్లుగా నమోదైంది. 9.4% వృద్ధితో నికర వడ్డీ ఆదాయం రూ.41,446 కోట్ల నుంచి రూ.45,190 కోట్లకు పెరిగింది. ఏడాది క్రితం రూ.3,823కోట్లుగా ఉన్న మొండి బకాయిలు రూ.4,458 కోట్లకు చేరినట్టు బ్యాంక్ ఛైర్మన్ తెలిపారు.
News February 8, 2026
బర్డ్ ఫ్లూతో భారీగా కోళ్లు మృతి.. చికెన్ తినొచ్చా?

AP: అన్నమయ్య(D) సదుం(M) పుత్తవారిపల్లె, అమ్మగారిపల్లె, కంభంవారిపల్లెల్లో వందల సంఖ్యలో కోళ్లు చనిపోగా పశుసంవర్ధక శాఖ అప్రమత్తమైంది. కోళ్ల శాంపిల్స్‌ను భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపగా బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లుగా నిర్ధారణ అయిందని అధికారులు పేర్కొన్నారు. బర్డ్‌ఫ్లూతో భయాందోళనలు వ్యక్తం అవుతున్న వేళ వారు కీలక సూచనలు చేశారు. 100 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతతో వేడి చేసిన చికెన్, గుడ్లను తినొచ్చని చెప్పారు.
News February 8, 2026
మున్సిపల్ ఎన్నికలు.. వైన్స్, బార్లు బంద్

TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ వైన్స్, బార్లు బంద్ కానున్నాయి. అన్ని మున్సిపాలిటీలలో ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అటు ఫలితాలు వెల్లడయ్యే 13వ తేదీ కూడా బంద్ పాటించాలని ఆదేశించింది. ఈ నెల 11వ తేదీ ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.


