News September 1, 2024
వరద నీటిని వృథా చేయవద్దు: CM రేవంత్
TG: భారీ వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వచ్చిన వరద నీటిని వృథా చేయవద్దని CM రేవంత్, మంత్రి ఉత్తమ్ అన్నారు. భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకునేలా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నీటిని నిల్వ చేయాలని సూచించారు. నంది, గాయత్రి పంప్ హౌస్‌ల ద్వారా లిఫ్ట్ చేసిన నీటిని రిజర్వాయర్లలో నింపాలని ఆదేశించారు.
Similar News
News September 19, 2024
వరదల తర్వాత అమరావతిపై ప్రజలకు నమ్మకం పోయింది: VSR
AP: విజయవాడ వరదల తర్వాత రాజధాని అమరావతిపై ప్రజలకు నమ్మకం పోయిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. బుడమేరు వరదలు, అమరావతి భవిష్యత్‌పై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఒకరి కల కోసం రాష్ట్రానికి కోట్లు ఖర్చు చేసే స్థోమత లేదు. పెట్టుబడి దారుల విశ్వాసం సన్నగిల్లింది. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ సాహసించడం లేదు’ అని ఆయన పేర్కొన్నారు.
News September 19, 2024
ఆ సంస్థ ఉద్యోగులకు ఇండియా హెడ్ మెయిల్
పనిఒత్తిడి కారణంగా 26 ఏళ్ల CA మృతి చెందిన ఘటనపై EY సంస్థ India ఛైర్మన్ రాజీవ్ మేమాని ఉద్యోగులకు పంపిన మెయిల్ వెలుగులోకొచ్చింది. సంస్థలో బాధితురాలి ప్రయాణం తక్కువ కాలంలోనే ముగిసిందని, ఈ విషయంలో ఆమె తల్లిదండ్రులు తనకు రాసిన లేఖను సీరియస్‌గా పరిగణిస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగులకు ఆరోగ్యకరమైన, సమతుల్య పని వాతావరణం కల్పించడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
News September 19, 2024
అశ్విన్ ఫైటింగ్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 339/6 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైనా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (102) సెంచరీతో చెలరేగారు. రవీంద్ర జడేజా (86) సహకారంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (56) అర్ధ సెంచరీతో రాణించారు. బంగ్లా బౌలర్లలో హసన్ మొహమూద్ 4, రానా, మిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.