News September 29, 2024
దసరా నుంచి ఇంటింటికి కార్గో సేవలు!

TG: దసరా నుంచి ఇంటింటికి కార్గో సేవలు అందించాలని RTC నిర్ణయించింది. వినియోగదారులు ఆన్‌లైన్‌లో బుక్ చేయగానే సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి వస్తువులను తీసుకెళ్లి ఇచ్చిన అడ్రస్‌లో డెలివరీ చేస్తారు. ఆర్డర్ పరిమాణాన్ని బట్టి 2/3/4 వీలర్ ఉపయోగిస్తారు. తొలుత దీనిని HYDలో, ఆ తర్వాత ఇతర జిల్లాల్లో అమలు చేయనున్నారు. ప్రస్తుతం కార్గో సేవలు ఒక బస్ స్టేషన్ నుంచి మరో బస్ స్టేషన్ వరకు మాత్రమే కొనసాగుతున్నాయి.
Similar News
News January 16, 2026
నేడు ఫిరాయింపు MLAల కేసు విచారణ

TG: నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల కేసును జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌ల ధర్మాసనం విచారించనుంది. 2023 ఎన్నికల్లో గెలిచిన 10 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి చేరినట్లు బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది. స్పీకర్ కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికే <<18864508>>నిర్ణయం<<>> తీసుకున్నారు. ఈ విషయాన్ని 3 నెలల్లో తేల్చాలంటూ గతంలో సుప్రీంకోర్టు స్పీకర్‌ను ఆదేశించింది.
News January 16, 2026
ఆరోగ్యం కోసం.. రోజూ ఉదయాన్నే ఇలా చేయండి

రోజును సరైన పద్ధతిలో ప్రారంభించడం ఆరోగ్యానికి కీలకమని నిపుణులు చెబుతున్నారు. 10 నిమిషాల పాటు చేసే చిన్న అలవాట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. ఉదయం నిద్రలేచిన వెంటనే నీరు తాగితే శరీరం హైడ్రేట్ అవుతుందని, ఖాళీ కడుపుతో కాఫీ/టీ తాగొద్దని సూచిస్తున్నారు. అదే విధంగా తేలికపాటి వ్యాయామం, మెడిటేషన్ చేస్తే గుండె, మెదడు పని తీరుతో పాటు పేగుల కదలికలను మెరుగుపరుస్తుందని వెల్లడించారు.
News January 16, 2026
కనుమ రోజు ఏ దేవుడిని పూజించాలంటే?

కనుమ నాడు పశువుల దైవమైన కాటమరాజుని, సకల దేవతా స్వరూపమైన కామధేనువును భక్తి శ్రద్ధలతో పూజించాలని పండితులు సూచిస్తున్నారు. పశుసంపదను చల్లగా చూడమని కోరుతూ ఊరి పొలిమేరల్లో మొక్కులు చెల్లిస్తారు. ఇలా చేస్తే పంటలు సమృద్ధిగా పండుతాయని నమ్మకం. ఈ రోజున పశువులను అందంగా అలంకరించి, వాటికి దిష్టి తీసి ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తారు. పిండివంటల తర్వాత కనుమ నాటి మాంసాహార విందులతో పండుగ సందడి ముగుస్తుంది.


