News August 22, 2024

దోస్త్: నేటి నుంచి ఇంట్రా కాలేజ్ స్లైడింగ్ రెండో విడత

image

TG: డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు రెండో విడత స్లైడింగ్(అదే కాలేజీలో గ్రూప్ మార్చుకోవడం)కు అధికారులు అవకాశం కల్పించారు. ఇవాళ, రేపు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. ఎల్లుండి సీట్లు కేటాయిస్తామన్నారు.

Similar News

News September 20, 2024

ప్చ్.. భారతీయ ఉద్యోగి! టూ మచ్ వర్కింగ్ అవర్స్..

image

ఉద్యోగులు కుటుంబ జీవితానికి ఎంత దూరమవుతున్నారో చెప్పేందుకు ఇదే నిదర్శనం. సగటు భారతీయుడు వారానికి 46.7Hrs పనిచేస్తున్నాడని ILO డేటా ద్వారా తెలిసింది. దీంతో సుదీర్ఘ సమయం పనిచేస్తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. దేశంలోని వర్క్‌ఫోర్స్‌లో 51% మంది వారానికి 49Hrs మించి పనిచేస్తుండటం గమనార్హం. 61 శాతంతో భూటాన్ No.1 ప్లేస్‌లో ఉంది. UAE 50.9, లెసొతో 50.4, బంగ్లా 47, పాక్ 40 టాప్10లో ఉన్నాయి.

News September 20, 2024

కొరియా షూటర్‌కు సినిమా అవకాశం

image

పారిస్ ఒలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు సాధించిన కొరియా షూటర్ కిమ్ యెజీ వీడియో అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తనకొచ్చిన పేరును సద్వినియోగం చేసుకునేందుకు గాను స్వదేశానికి వెళ్లిన తర్వాత ఆమె ఓ టాలెంట్ మేనేజ్‌మెంట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దీంతో ‘క్రష్’ అనే పాన్ వరల్డ్ సినిమాలో ఆమెకు పాత్ర దక్కింది. భారత్ నుంచి అనుష్క సేన్ సహా పలు దేశాల నటులు ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం.

News September 20, 2024

సీబీఐతో విచారణ చేయించాలి.. CBNకు బండి లేఖ

image

తిరుమల లడ్డూ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ‘తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీతో పాటు, అవినీతి, అన్యమత ప్రచారంపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రమేయాన్ని నిర్ధారించడంతో పాటు, ఇతర రాష్ట్రాల్లోనూ విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉన్నందున సీబీఐతో దర్యాప్తు చేయించాలి. తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించాలి’ అని లేఖలో పేర్కొన్నారు.