News June 19, 2024
నేటి నుంచి దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్
TG: దోస్త్ సెకండ్ ఫేజ్ సీట్లను 41,553 మంది విద్యార్థులకు కేటాయించినట్లు విద్యాశాఖ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. నేటి నుంచి మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుందని చెప్పారు. జులై 2వరకు నమోదు ప్రక్రియ ఉంటుందని, 6న సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. కాగా తొలి విడతలో 76,290 మందికి సీట్లు దక్కగా 57 వేల మందే ప్రవేశాలు పొందారు.
Similar News
News September 19, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 19, 2024
J&K తొలి విడత ఎన్నికలు.. 59 శాతం పోలింగ్ నమోదు
పదేళ్ల తర్వాత జరుగుతున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 59శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కిశ్త్‌వాడ్‌లో అత్యధికంగా 77శాతం, పుల్వామాలో అత్యల్పంగా 46శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. J&Kలో 90 స్థానాలుండగా ఫస్ట్ పేజ్‌లో 7 జిల్లాల్లోని 24 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది.
News September 19, 2024
‘వైఎస్సార్ లా నేస్తం’ పేరు మార్పు
AP: గత ప్రభుత్వ హయాంలో అమలైన మరో పథకం పేరును కూటమి ప్రభుత్వం మార్చింది. ‘వైఎస్సార్ లా నేస్తం’ స్కీమ్ పేరును ‘న్యాయమిత్ర’గా మారుస్తూ న్యాయశాఖ కార్యదర్శి సునీత ఉత్తర్వులు ఇచ్చారు. ఈ పథకం కొత్త మార్గదర్శకాలను త్వరలో జారీ చేస్తామని తెలిపారు. న్యాయమిత్ర ద్వారా జూనియర్ లాయర్లకు స్టైఫండ్ అందిస్తారు.