News June 12, 2024
పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా

జనసేనాని మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వేళ ఆయన నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కొత్త పోస్టర్ రిలీజైంది. ‘కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను…’ అనే క్యాప్షన్‌తో ఈ పోస్టర్‌ను డైరెక్టర్ హరీశ్ శంకర్ అభిమానులతో పంచుకున్నారు. ఆ పోస్టర్‌లో ‘సనాతన ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే..’ అని రాసి ఉంది.
Similar News
News March 24, 2025
కాంగ్రెస్ అధిష్ఠానంతో రాష్ట్ర నేతల భేటీ

కాంగ్రెస్ అధిష్ఠానంతో తెలంగాణ నేతల సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. మంత్రి వర్గ విస్తరణ, రిజర్వేషన్ల అంశం, డీలిమిటేషన్ వంటి అంశాలపై వీరు చర్చించే అవకాశం ఉంది.
News March 24, 2025
21 బంతుల్లో హాఫ్ సెంచరీ

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో లక్నో బ్యాటర్ మిచెల్ మార్ష్ వీర విహారం చేశారు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశారు. ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదారు. మరోవైపు పూరన్ సైతం ధాటిగా ఆడుతున్నారు. 7 ఓవర్లలో స్కోరు 89/1.
News March 24, 2025
రాత్రి భోజనం తర్వాత ఇలా చేయండి!

కొన్ని అలవాట్లు రాత్రి తిన్న తర్వాత జీర్ణక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు. ‘తిన్న తర్వాత ఓ 10 ని.లు నడిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గోరు వెచ్చని నీళ్లు తాగితే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. తిన్న తర్వాత ఓ 30 ని.లు పడుకోకుండా ఉంటే ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉండవు. సోంపు లేదా వాము నమిలితే బాగా జీర్ణమై మలబద్ధకం తగ్గుతుంది. కొద్దిసేపు నిటారుగా కూర్చున్నా మంచిదే’ అని తెలిపారు.