News September 24, 2024

మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

image

TG: మూసీ నిర్వాసితులకు 16వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 10,200 మంది నిర్వాసితులను గుర్తించింది. ముందుగా రివర్ బెడ్‌లోని 1600 ఇళ్లను తొలగించనున్నట్లు సమాచారం. RFCTLARR చట్టం ప్రకారం పరిహారం చెల్లించనుంది. పట్టా భూమి ఉంటే ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చుతో పాటు భూమి విలువ కూడా చెల్లించాలని నిర్ణయించనుంది.

Similar News

News September 25, 2024

అర్ధరాత్రి ఒంటి గంట వరకు హోటల్స్, రెస్టారెంట్స్

image

HYD పరిధిలో వ్యాపార సముదాయాల పనివేళలను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. హోటల్స్, రెస్టారెంట్స్, ఐస్‌క్రీమ్, కాఫీ, పాన్ షాప్స్‌ను అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచుకునేందుకు అనుమతినిచ్చింది. క్లాత్స్, జువెల్లరీ, సూపర్ మార్కెట్స్, కిరాణా తదితర షాప్స్ ఉ.9 నుంచి రా.11 వరకు, వైన్స్‌ 10am నుంచి 11pm వరకు, బార్లు వీక్ డేస్‌లో ఉ.10-రా.12, వీకెండ్స్‌లో ఉ.10-రా.ఒంటి గంట వరకు నడపొచ్చని పేర్కొంది.

News September 25, 2024

వరుస రైలు ప్రమాదాలు.. రైల్వే కీలక నిర్ణయం

image

వరుస రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదం జరిగిన చోట అత్యవసర సహాయక చర్యలు అందించేందుకు ‘రైల్ రక్షక్ దళ్’ను ఏర్పాటు చేసింది. దీని కోసం ఉద్యోగులకు అన్ని విభాగాల్లో శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్‌లో దీనిని ప్రారంభించింది.

News September 25, 2024

ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రేపు రాష్ట్రంలో అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, వైజాగ్, అనకాపల్లి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయంది.