News September 24, 2024
మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

TG: మూసీ నిర్వాసితులకు 16వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 10,200 మంది నిర్వాసితులను గుర్తించింది. ముందుగా రివర్ బెడ్‌లోని 1600 ఇళ్లను తొలగించనున్నట్లు సమాచారం. RFCTLARR చట్టం ప్రకారం పరిహారం చెల్లించనుంది. పట్టా భూమి ఉంటే ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చుతో పాటు భూమి విలువ కూడా చెల్లించాలని నిర్ణయించనుంది.
Similar News
News February 16, 2026
మాజీ ఎంపీ కన్నుమూత

AP: రాజ్యసభ మాజీ MP తడపట్ల రత్నాబాయి(79) కన్నుమూశారు. ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో పోలవరం(D) రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆమె చనిపోయారు. రత్నాబాయి 1972లో ఎల్లవరం(ప్రస్తుతం ర.చోడవరం) నుంచి కాంగ్రెస్ MLAగా గెలిచారు. 2008లో MPగా, 2014-20 వరకు MLCగా సేవలందించారు. అటు BC ఉద్యమ నేత, మాజీ MLC ఐలాపురం వెంకయ్య(93) అనారోగ్య సమస్యలతో నిన్న విజయవాడలో తుదిశ్వాస విడిచారు.
News February 16, 2026
చర్మ సంరక్షణలో కొల్లాజెన్ కీలకపాత్ర

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి కొల్లాజెన్ ప్రోటీన్ ముఖ్యం. వయసు పెరిగేకొద్దీ శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో కీళ్ల నొప్పులు, చర్మంముడతలు, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. గట్ ఆరోగ్యమూ దెబ్బతింటుంది. ఇలా కాకుండా ఉండాలంటే చేపలు, సిట్రస్ ఫ్రూట్స్, బెర్రీలు, గుడ్లు, ఆకుకూరలు, అవకాడో, దాల్చినచెక్క, గ్రీన్‌టీ తీసుకోవాలని సూచిస్తున్నారు.
News February 16, 2026
జామలో కాయకుళ్లు తెగులు నివారణకు సూచనలు

జామ తోటల్లో పక్వానికి వచ్చిన పండ్లపై ఈ తెగులు ప్రభావం కనిపిస్తుంది. కాయకుళ్లు సోకిన జామ పండ్లపై గుండ్రటి గోధుమ రంగు మచ్చలు గుంటలు పడి కనిపిస్తాయి. గోధుమ మచ్చలపై గులాబీ రంగు మచ్చలు కూడా కనిపిస్తాయి. మచ్చలు ఏర్పడిన 3 నుంచి 4 రోజుల్లో పండు కుళ్లిపోతుంది. దీని నివారణకు కాయలు ఏర్పడే సమయంలో కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటర్ నీటికి 4గ్రాముల చొప్పున 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి.


