News August 27, 2024
‘డబుల్ ఇస్మార్ట్’ ఫ్లాప్.. నెక్స్ట్ ఏంటి?
లైగర్ ఫ్లాప్ తర్వాత పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో పూరీ దర్శకత్వంలో పస తగ్గిందనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల సినిమాల్లో ఆయన స్టైల్ మిస్ అయిందని, ట్రేడ్ మార్క్ డైలాగ్స్ లోపించాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న డిఫరెంట్ మూవీతో వస్తేగానీ కమ్ బ్యాక్ ఇవ్వలేరని అభిమానులు చర్చించుకుంటున్నారు.
Similar News
News September 14, 2024
వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్
APలో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు, కౌన్సిలర్లు, MPTCలకు ఇవ్వాలన్నారు. సచివాలయ వ్యవస్థను కూడా పంచాయతీ రాజ్ శాఖలో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అటు వరదలతో ప్రభావితమైన 400 పంచాయతీలకు రూ.లక్ష చొప్పున సాయం ప్రకటించిన డిప్యూటీ CM పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
News September 14, 2024
ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి నేటికి 17 ఏళ్లు పూర్తి
మహేంద్ర సింగ్ ధోనీ టీమ్ ఇండియా పగ్గాలు చేపట్టి నేటికి సరిగ్గా 17 ఏళ్లు పూర్తయ్యాయి. 2007 సెప్టెంబర్ 14న ఆయన సారథ్య బాధ్యతలు చేపట్టారు. ధోనీ కెప్టెన్సీ చేపట్టిన వెంటనే 2007 టీ20 WC సాధించారు. ఆ తర్వాత సీబీ సిరీస్ 2008, ఐపీఎల్ 2010, సీఎల్ టీ20 2010, ఆసియా కప్ 2010, odi WC 2011, ఐపీఎల్ 2011, ఛాంపియన్స్ ట్రోఫీ 2013, సీఎల్ టీ20 2014, ఆసియా కప్ 2016, ఐపీఎల్ 2018, 21, 23లో టైటిళ్లు సాధించారు.
News September 14, 2024
వంట నూనె ధరలు పెరగనున్నాయా?
కేంద్ర ప్రభుత్వం వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని 20% పెంచింది. దీంతో సన్‌ఫ్లవర్, సోయా బీన్, రిఫైన్డ్ పామాయిల్‌పై ఇంపోర్ట్ టాక్స్ 12.5% నుంచి 32.5%కి చేరింది. దేశంలో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న నేపథ్యంలో రైతులను ఆదుకునే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా ఇంపోర్ట్ టాక్స్ పెంపుతో వంట నూనెల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.