News August 14, 2024
APలో ‘డబుల్ ఇస్మార్ట్’ టికెట్ ధరల పెంపు
‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. రేపు విడుదల కానున్న ఈ మూవీకి టికెట్ రేట్లను రూ.35కు పైగా పెంచుకునేందుకు అనుమతిస్తూ ఏపీ సర్కారు జీవో విడుదల చేసింది. పూరీ జగన్నాథ్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో తెలిపింది. రిలీజ్ రోజు నుంచి 10 రోజుల వరకు ఈ రేట్లు ఉండనున్నాయి.
Similar News
News September 10, 2024
ప్రపంచంలోని 20 శాతం చెత్త భారత్‌లోనే
ప్రపంచంలోని ప్లాస్టిక్ చెత్తలో 20 శాతం భారత్‌దేనని ఓ సర్వే తెలిపింది. ఏటా 9.3 మిలియన్ల టన్నుల చెత్తను ఉత్పత్తి చేస్తోందని పేర్కొంది. భారత్ తర్వాత నైజీరియా (3.5 Mt), ఇండోనేషియా(3.4 Mt), చైనా(2.8 Mt), పాకిస్థాన్(2.6 Mt), బంగ్లాదేశ్(1.7 Mt), రష్యా(1.7 Mt), బ్రెజిల్(1.4 Mt), థాయిలాండ్(1 Mt) కాంగో (1 Mt) ఉన్నాయి. ఈ దేశాల్లో ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేసే వ్యవస్థలు లేకపోవడంతో చెత్త పెరుగుతోంది.
News September 10, 2024
నేడు తాడేపల్లికి జగన్ రాక
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. టీడీపీ ఆఫీస్, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో అరెస్టై గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను రేపు ఆయన పరామర్శించనున్నారు. అదే జైల్లో ఉన్న విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త అవుతు శ్రీనివాసరెడ్డిని కూడా జగన్ కలవనున్నారు. అనంతరం ఆయన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.
News September 10, 2024
చాకలి ఐలమ్మ పోరాటం భావితరాలకు స్ఫూర్తి
భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం వీరనారి చాకలి ఐలమ్మ సాయుధ పోరాటం చేశారు. నిజాం నవాబుకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు. కౌలు భూమిలో తాను పండించిన పంటను దేశ్‌ముఖ్ రేపాక రామచంద్రారెడ్డి తన అనుచరులతో తరలించుకుపోవడానికి ప్రయత్నించగా వారిని తరిమి కొట్టారు. ఇదే సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికింది. ‘బాంచన్ కాల్మొక్తా’ అనే బతుకులను మార్చడానికి ఐలమ్మ జీవితం త్యాగం చేశారు. నేడు ఆమె వర్ధంతి.