News January 24, 2025

రీ సర్వేపై సందేహాలా? ఈ నంబర్‌కు ఫోన్ చేయండి

image

APలో భూముల రీసర్వే పైలట్ ప్రాజెక్టు అమలవుతున్న నేపథ్యంలో రైతుల సందేహాల నివృత్తికై ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించింది. ఉ.10 నుంచి సా.5.30 వరకు 8143679222 నంబర్‌కు ఫోన్ చేసి సందేహాలు, సమస్యలు తెలియజేయవచ్చని సూచించింది. రీసర్వే సందర్భంగా యజమానులు భూమి వద్దకు వచ్చి హద్దులు చూపించేందుకు 3సార్లు అవకాశం ఉంటుందని, అయినా రాకపోతే వీడియో కాల్ ద్వారా హద్దులు ఖరారు చేస్తామని అధికారులు తెలిపారు.

Similar News

News February 13, 2025

ప్రభాస్, మోహన్ లాల్ రెమ్యునరేషన్ తీసుకోలేదు: విష్ణు

image

‘కన్నప్ప’ కోసం ఏడేళ్లుగా కష్టపడుతున్నామని, రూ.140 కోట్లతో తెరకెక్కిస్తున్నామని హీరో మంచు విష్ణు తెలిపారు. ప్రభాస్, మోహన్ లాల్ రెమ్యునరేషన్ తీసుకోకుండానే ఈ చిత్రంలో నటించారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పారితోషికం గురించి నేను ‘కంప్లీట్ యాక్టర్‌’ వద్ద ప్రస్తావిస్తే ఆయన నవ్వుతూ ‘నువ్వు అంత పెద్దవాడివయ్యావా’ అని అన్నారన్నారు. డార్లింగ్ వల్ల తనకు స్నేహంపై నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు.

News February 13, 2025

BREAKING: తోటి సిబ్బందిపై CRPF జవాన్ ఘాతుకం

image

మణిపుర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సంజయ్ కుమార్ అనే CRPF జవాన్ తన సర్వీస్ తుపాకీతో తోటి సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు జవాన్లు చనిపోగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం తనను తాను కాల్చుకుని నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.

News February 13, 2025

సికింద్రాబాద్.. ఈ భవనాలు ఇక కనిపించవు

image

సికింద్రాబాద్ అనగానే ఠక్కున గుర్తొచ్చే భవనాలు ఇవి. ఎన్నో ఏళ్లుగా ప్రయాణికుల గుండెల్లో, సినిమాల్లో కనిపించిన ఈ రైల్వే స్టేషన్ భవనాలు పూర్తిగా కనుమరుగు కానున్నాయి. ఎన్నో ప్రయాణాలకు సాక్ష్యంగా నిలిచిన ఈ భవనాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. స్టేషన్ అభివృద్ధిలో భాగంగా వీటి స్థానంలో ₹700crతో ఎయిర్‌పోర్టులా నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో పాత భవనాలను గుర్తు చేసుకుంటూ ప్రయాణికులు ఎమోషనల్ అవుతున్నారు.

error: Content is protected !!