News March 18, 2024
పోలీసుల తీరుపై అనుమానాలున్నాయి: నాదెండ్ల

AP: బొప్పూడిలో నిన్న జరిగిన ప్రజాగళం సభలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అనుమానాలున్నాయని జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘దేశ ప్రధాని హాజరైన ప్రజాగళం సభలో తీవ్ర భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. కలెక్టర్, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పేర్లు, ఫొటోలు లేకుండానే ఇష్టారీతిన పాస్లు జారీ చేశారు. దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. అధికారుల తీరుపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం’ అని చెప్పారు.
Similar News
News October 27, 2025
RAC సీట్లకు సగం ఛార్జీలు తిరిగి చెల్లించాలని డిమాండ్!

రైళ్లలో RAC ఛార్జీలపై ప్రయాణికులు SM వేదికగా విమర్శలు చేస్తున్నారు. సగం సైడ్ లోవర్ బెర్త్కు పూర్తి ఛార్జీ వసూలు చేయడం అన్యాయమని, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు నిద్ర లేకుండా ప్రయాణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చార్ట్ తయారైన వెంటనే RAC ప్రయాణికులకు సగం డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిని అమలు చేయాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?
News October 27, 2025
నామ జప ఫలితాన్ని తగ్గించే అపరాధాలు

భగవంతుని స్మరణలో భాగంగా ఆయన నామ జపం చేయడం గొప్ప పుణ్యకార్యం. అయితే శాస్త్రాల ప్రకారం.. ఆయన నామాన్ని జపించేటప్పుడు 10 రకాల అపరాధాలను చేయకూడదట. ఎంత జపం చేసినా ఈ అపరాధాలు ఉంటే ఆ నామ జపం పూర్తి ఫలితం ఎన్నటికీ లభించదు. నామ జపం అంటే.. కేవలం నామమును ఉచ్ఛరిస్తే సరిపోదు. దానిని భక్తితో, నియమబద్ధంగా చేయాలి. లేకపోతే ఆ కర్మ కేవలం శ్రమగా మిగిలిపోతుంది. ఆశించిన పుణ్యం, ఆధ్యాత్మిక లాభం సిద్ధించదు. <<-se>>#Bakthi<<>>
News October 27, 2025
శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్టులో ఉద్యోగాలు

కోల్కతాలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్ట్ 4 ట్రెయినీ డాక్ పైలట్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి బీఎస్సీ నాటికల్ సైన్స్, సెకండ్ మేట్(FG)/డ్రెడ్జ్ మేట్ గ్రేడ్ 1 అర్హతగల అభ్యర్థులు నవంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అనంతరం దరఖాస్తు హార్డ్ కాపీని స్పీడ్ పోస్ట్ చేయాలి. రాతపరీక్ష/ప్రొఫిషియెన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://smp.smportkolkata.in/


