News July 15, 2024
అధికారులు సమర్పించిన నివేదికలపై అనుమానాలు: ప్రభుత్వం
AP: ఇసుక అక్రమ తవ్వకాలపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. గతంలో అధికారులు సమర్పించిన నివేదికలపై అనుమానాలున్నాయని, సరైన సమాచారం ఇవ్వలేదని మీడియాలోనూ వార్తలు వచ్చినట్లు తెలిపింది. పూర్తిస్థాయి నివేదిక సమర్పించడానికి రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా ధర్మాసనాన్ని గడువు కోరింది. దీంతో సుప్రీంకోర్టు విచారణను ఆగస్టు 2కు వాయిదా వేసింది.
Similar News
News October 11, 2024
నితీశ్‌కుమార్ రెడ్డికి గంభీర్ గోల్డెన్ అడ్వైస్
కోచ్ గౌతమ్ గంభీర్ సలహా తన కాన్ఫిడెన్స్‌ను పెంచిందని టీమ్ఇండియా యంగ్ సెన్సేషన్ నితీశ్‌కుమార్ రెడ్డి (NKR) అన్నారు. బంగ్లాతో రెండో టీ20లో మెరుగైన ప్రదర్శనకు అదే కారణమని చెప్పారు. ‘నిజం చెప్పాలంటే నేను గౌతమ్ సర్‌కు థాంక్స్ చెప్పాలి. బౌలింగ్ చేస్తున్నప్పుడు బౌలర్‌లా ఆలోచించాలని, బౌలింగ్ చేయగలిగే బ్యాటర్‌గా కాదని ప్రతిసారీ చెప్తుంటారు’ అని అన్నారు. మ్యాచులో NKR 74 (34balls), 2 వికెట్లు సాధించారు.
News October 11, 2024
తల్లి లేదు.. రాదు.. పాపం ఆ పిల్లలకు అది తెలియదు!
ఆ తల్లి కుక్క ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. దానికి పాలు తాగే నాలుగు పిల్లలున్నాయి. తమ తల్లి ప్రాణాలతో లేదన్న విషయం అన్నెం పున్నెం తెలియని ఆ పిల్లలకు తెలిసే దారేది? అప్పటి వరకూ ఆడుకుని అలసిపోయి వచ్చాయి. అమ్మ లేస్తుందని, పాలిస్తుందని చూశాయి. ఎంతసేపటికీ తల్లి లేవకపోవడంతో దీనంగా దాని చెంతనే నిద్రపోయాయి. కర్నూలు జిల్లా సి.బెళగల్ బస్టాండ్ ఆవరణలో చోటుచేసుకున్న ఈ సన్నివేశం చూపరులను కదిలించింది.
News October 11, 2024
చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు: లోకేశ్
AP: పంటలు పండని అనంతపురంలో కార్లు పరిగెత్తించిన ఘనత సీఎం చంద్రబాబుదేనని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. మంగళగిరిలో కియా షోరూమ్‌ను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. ‘దేశంలో ఎక్కడ కియా కారు కనిపించినా మేడిన్ ఆంధ్రా అంటున్నారు. CBN విజన్ ఉన్న నాయకుడు. TCSను ఒప్పించి పెట్టుబడులు తేవడమే కాదు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. చిన్న పరిశ్రమలనూ ప్రోత్సహిస్తూ ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నాం’ అని తెలిపారు.