News April 11, 2025
మాయావతి మేనకోడలికి కట్నం వేధింపులు

భర్త, అత్తింటి వారిపై BSP అధినేత్రి మాయావతి మేనకోడలు వరకట్నం కేసులు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. UPలోని హాపూర్ మునిసిపల్ కౌన్సిల్ ఛైర్‌పర్సన్ పుష్పా దేవి కుమారుడు విశాల్ సింగ్‌ను బాధితురాలు 2023లో పెళ్లి చేసుకుంది. గత కొంతకాలంగా వారు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కంప్లైంట్ అనంతరం పుష్పా దేవిని, ఆమె కుటుంబీకుల్ని BSP వెంటనే పార్టీ నుంచి తప్పించింది.
Similar News
News April 17, 2026
మీరేం సాధించారో ఆలోచించుకోండి.. జగన్ ఆగ్రహం

AP: మహిళలకు రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించిన పార్టీలను విమర్శిస్తూ YCP చీఫ్ జగన్ ట్వీట్ చేశారు. ‘మీరేం సాధించారో ఓసారి ఆలోచించుకోండి. మహిళా రిజర్వేషన్ల బిల్లు వాయిదా పడింది. అటు దక్షిణాదికి గానీ ఇటు మహిళలకు గానీ న్యాయం జరగలేదు. ఒకవేళ 2026 జనగణన ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే దక్షిణాది పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది’ అని పేర్కొన్నారు.
News April 17, 2026
దేశవ్యాప్తంగా నిరసనలకు NDA పిలుపు

మహిళా బిల్లు వీగిన నేపథ్యంలో విపక్షాల తీరును ఎండగడుతూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని NDA నిర్ణయించింది. దేశంలోని ప్రతి జిల్లా కేంద్రంలో BJP మహిళా నేతల ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు జరగనున్నాయి. మూడు వారాల పాటు వీటిని కొనసాగించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నిరసనలతో ప్రతిపక్షాల వైఖరి గురించి ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని హైకమాండ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
News April 17, 2026
రాణించిన గ్రీన్.. KKR స్కోర్ 180

IPLలో రూ.25.2 కోట్ల ఆటగాడు <<19653410>>కామెరూన్ గ్రీన్(KKR)<<>> ఎట్టకేలకు తన స్థాయికి తగ్గట్లు ఆడారు. GTతో మ్యాచులో 32కే 3 వికెట్లు కోల్పోయిన స్థితిలో బ్యాటింగుకు వచ్చి 55 బంతుల్లో 79 పరుగులు(4 సిక్సులు, 7 ఫోర్లు) చేశారు. దీంతో కోల్‌కతా 20 ఓవర్లలో 180 స్కోరుకు ఆలౌటైంది. టిమ్ 19, రహానే 0, రఘువంశీ 8, పావెల్ 27, అనుకుల్ 9, రింకూ 1, రమణ్‌దీప్ 17 రన్స్ చేశారు. రబాడ 3, అశోక్ 2, సిరాజ్ 2, ప్రసిద్ధ్ ఒక వికెట్ తీశారు.


