News February 21, 2025
‘డ్రాగన్’పై నెట్టింట ప్రశంసలు!

‘లవ్ టుడే’తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ ఈరోజు విడుదలైంది. మరోసారి ట్రెండీ లవ్ స్టోరీతో అదరగొట్టారని సినిమా చూసిన వారు పోస్టులు పెడుతున్నారు. సినిమా చూస్తున్నంతసేపూ ఇలాంటి కథను ఎక్కడో విన్నట్లు, చూసిన ఫీలింగ్ కలిగిందని అభిప్రాయపడుతున్నారు. సైలెంట్‌గా వచ్చి హిట్ కొట్టాడంటూ ప్రశంసిస్తున్నారు. మీరూ సినిమా చూశారా? COMMENT
Similar News
News March 27, 2025
ప్రపంచ కుబేరుల కొత్త జాబితా!

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో ఎలాన్ మస్క్ $420 బిలియన్ల(దాదాపు రూ.36 లక్షల కోట్లు)తో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. US ప్రెసిడెంట్‌గా ట్రంప్ ఎన్నికయ్యాక మస్క్ ఆస్తి భారీగా పెరిగినట్లు పేర్కొంది. ఇక రెండు, మూడు స్థానాల్లో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్ నిలిచారు. వీరి తర్వాత వారెన్ బఫెట్, బిల్ గేట్స్, లారీ పేజ్, ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ ఉన్నారు.
News March 27, 2025
ప్రభాస్ పెళ్లి వార్తలపై టీమ్ క్లారిటీ

రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి వార్తలపై ఆయన టీమ్ స్పందించింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి కుమార్తెను ఆయన వివాహం చేసుకుంటారని జరిగిన ప్రచారాన్ని ఖండించింది. అలాంటి వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అంతకుముందు భీమవరం అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని జరిగిన ప్రచారాన్ని కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.
News March 27, 2025
2 రోజులు సెలవులు

TG: రంజాన్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రెండు రోజులు సెలవులు మంజూరు చేసింది. తెలంగాణ క్యాలెండర్ ప్రకారం మార్చి 31న (సోమవారం) ఈద్ ఉల్ ఫితర్‌తో పాటు ఆ తర్వాతి రోజు ఏప్రిల్ 1న (మంగళవారం) కూడా హాలిడే ఇచ్చింది. ఇక మార్చి 28న జుమాతుల్-విదా, షబ్-ఎ-ఖాదర్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. ఆ రోజు మైనారిటీ విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. అటు ఏపీలో మార్చి 31న మాత్రమే సెలవు ఇచ్చారు.