News May 10, 2024
‘హనీ ట్రాప్’ లో DRDO ఉద్యోగి.. పాక్‌కు కీలక సమాచారం చేరవేత

హైదరాబాద్‌లోని DRDO ఉద్యోగి ప్రవీణ్ మిశ్రా పాకిస్థాన్ మహిళ ‘హనీ ట్రాప్’లో పడి, దేశ సమాచారాన్ని శత్రు దేశానికి చేరవేశాడు. అతడిని గుజరాత్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ISIకి చెందిన సోనాల్ గార్గ్.. తాను IBM ఉద్యోగినని ప్రవీణ్‌కు పరిచయం చేసుకుంది. క్రమంగా అతడితో సన్నిహితంగా మెలిగి కీలక సమాచారాన్ని పొందింది. ప్రవీణ్ ఆఫీస్ సర్వర్‌లో ఆమె ఓ మాల్వేర్‌ను కూడా ఇన్‌స్టాల్ చేసినట్లు గుర్తించి, విచారణ చేపట్టారు.
Similar News
News January 14, 2026
యాంటీబయాటిక్స్‌తో ఎర్లీ ప్యూబర్టీ

పుట్టిన తొలినాళ్లలో యాంటీబయోటిక్స్ వాడిన ఆడపిల్లల్లో ఎర్లీ ప్యూబర్టీ వస్తున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దక్షిణ కొరియాకి చెందిన యూనివర్సిటీ ఆసుపత్రులు చేసిన అధ్యయనంలో ఏదైనా అనారోగ్య కారణంతో ఏడాదిలోపు- ముఖ్యంగా తొలి మూడునెలల్లో- యాంటీబయోటిక్స్ తీసుకున్న ఆడపిల్లల్లో 22 శాతం మంది ఎనిమిదేళ్లకంటే ముందుగానే రజస్వల అవడాన్ని గమనించారు. ఈ పరిస్థితిని సెంట్రల్ ప్రికాషియస్ ప్యుబర్టీ అంటారు.
News January 14, 2026
నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ పబ్లిక్ టాక్

జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ మూవీ యూఎస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి. స్టోరీ లైన్ పాతదే అయినా కామెడీతో నవీన్ వన్ మ్యాన్ షో చేశారని ఆడియన్స్ తెలిపారు. పాటలను గ్రాండ్‌గా చిత్రీకరించారని, నిర్మాణ విలువలు బాగున్నాయన్నారు. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించాయని చెప్పారు. కాసేపట్లో Way2Newsలో మూవీ రివ్యూ & రేటింగ్.
News January 14, 2026
NEET PG.. నెగటివ్ మార్కులు వచ్చినా అడ్మిషన్!

దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న PG మెడికల్ సీట్లను భర్తీ చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత పర్సంటైల్‌ను భారీగా తగ్గించడంతో రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు మైనస్ 40 మార్కులు సాధించినా అడ్మిషన్ పొందే అవకాశం దక్కింది. జనరల్, EWS అభ్యర్థులకు 7 పర్సంటైల్, PwBD 5 పర్సంటైల్, SC/ST/OBCలకు జీరో పర్సంటైల్‌గా కటాఫ్ నిర్ణయించారు. ఈ నిర్ణయం వైద్య విద్య ప్రమాణాలను దిగజార్చుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.


