News January 14, 2025

అడిగిన ప్రతి రైతుకూ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు: సీఎం చంద్రబాబు

image

AP: సంక్షేమ పథకాల అమలులో మోసాలు జరగకుండా సాంకేతికతను వినియోగిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. రైతుల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అడిగిన ప్రతి ఒక్కరికీ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందిస్తామని, పశువులకు షెడ్లు నిర్మిస్తామని ప్రకటించారు. కిరాణా దుకాణాల ద్వారా సరకుల పంపిణీ చేపడతామన్నారు. ప్రజల ఆదాయం పెంచడం, పర్యావరణ పరిరక్షణే తన లక్ష్యమని పేర్కొన్నారు.

Similar News

News February 6, 2025

ప్రయాగ్‌రాజ్‌లో హరీశ్ రావు దంపతులు

image

TG: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. మహాకుంభమేళా సందర్భంగా తన సతీమణి శ్రీనితతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ప్రజల శ్రేయస్సు, శాంతి, సామరస్యం కోసం గంగమ్మను ప్రార్థించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

News February 6, 2025

రేపు ఒంగోలులో ఆర్జీవీ విచారణ

image

AP: సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మను రేపు ఒంగోలు రూరల్ పీఎస్‌లో పోలీసులు విచారించనున్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని గతంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాలని రెండుసార్లు పోలీసులు నోటీసులిచ్చినా వర్మ హాజరుకాలేదు. తాజాగా ఫిబ్రవరి 4న మరోసారి సమన్లు ఇవ్వగా ఈనెల 7న హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్జీవీ కోరారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణపై ఉత్కంఠ నెలకొంది.

News February 6, 2025

BREAKING: భారత్ విజయం

image

ENGతో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు జైస్వాల్ (15), రోహిత్ (2) వెంటనే ఔటైనా గిల్ (87), అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రెండో వన్డే ఈనెల 9న కటక్ వేదికగా జరగనుంది.

error: Content is protected !!