News February 21, 2025

త్వరలో ‘దృశ్యం-3’ షురూ

image

జీతూ జోసెఫ్ డైరెక్షన్‌లో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘దృశ్యం-1, 2’ సినిమాలకు ప్రత్యేక ఫాన్ ఫాలోయింగ్ ఉంది. దాదాపు అన్ని భాషల్లో ఈ చిత్రాలు రీమేక్ అయ్యాయి. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పార్ట్-3 త్వరలోనే పట్టాలెక్కనుందని మోహన్ లాల్ అధికారికంగా ప్రకటించారు. ‘గతం ఎప్పుడూ సైలెంట్‌గా ఉండదు. దృశ్యం-3 పక్కా’ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. నిర్మాత ఆంటోనీ, డైరెక్టర్‌తో దిగిన ఫొటోను షేర్ చేశారు.

Similar News

News February 22, 2025

టర్కీ అధ్యక్షుడిపై భారత్ ఆగ్రహం

image

టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ఇటీవల పాక్‌లో పర్యటించినప్పుడు కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చర్చల ద్వారా కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలని, ప్రజల ఆశల్ని దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. ఆ మాటలపై భారత్ తీవ్రంగా మండిపడింది. ‘కశ్మీర్ అనేది పూర్తిగా మా సార్వభౌమత్వంలోనిది. ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. టర్కీ రాయబారి వద్ద మా నిరసనను వ్యక్తం చేశాం’ అని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.

News February 22, 2025

ముస్లింలను త్వరగా పంపించే ఆలోచన లేదు: కర్ణాటక మంత్రి

image

రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులు పని నుంచి త్వరగా ఇంటికెళ్లేందుకు తెలుగు రాష్ట్రాలు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. కర్ణాటకలోనూ ఆ సదుపాయాన్ని కల్పించాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సీఎం సిద్దరామయ్యకు లేఖ రాశారు. అయితే, తమకు అలాంటి ఆలోచనేమీ లేదని రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర తెలిపారు. అలాంటి ప్రతిపాదననేమీ చూడట్లేదని, ఇతర రాష్ట్రాలేం చేస్తున్నాయన్నది తమకు అనవసరమని ఆయన పేర్కొన్నారు.

News February 22, 2025

మహాసముద్రాల్లో వింత ఘటనలు.. ఏదో జరుగుతోందా?

image

AP తీర ప్రాంతాల్లో వేలాది మృత తాబేళ్ల కళేబరాలు కొట్టుకొస్తున్నాయి. ఆస్ట్రేలియాలో 150 కిల్లర్ వేల్స్ ఒడ్డుకి చేరి విలవిల్లాడుతూ మరణించాయి. అట్టడుగు లోతుల్లో చీకట్లో బతికే యాంగ్లర్, ఓర్ చేపలు లోతు తక్కువ నీటిలోకి వస్తున్నాయి. ఒక ఓర్ చేప స్పెయిన్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చింది. దీంతో మహాసముద్రాల్లో ఏదో జరుగుతోందన్న చర్చ నడుస్తోంది. రాబోతున్న ఘోర విపత్తుకి ఇవి సంకేతాలా అంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

error: Content is protected !!