News February 21, 2025
త్వరలో ‘దృశ్యం-3’ షురూ

జీతూ జోసెఫ్ డైరెక్షన్‌లో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘దృశ్యం-1, 2’ సినిమాలకు ప్రత్యేక ఫాన్ ఫాలోయింగ్ ఉంది. దాదాపు అన్ని భాషల్లో ఈ చిత్రాలు రీమేక్ అయ్యాయి. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పార్ట్-3 త్వరలోనే పట్టాలెక్కనుందని మోహన్ లాల్ అధికారికంగా ప్రకటించారు. ‘గతం ఎప్పుడూ సైలెంట్‌గా ఉండదు. దృశ్యం-3 పక్కా’ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. నిర్మాత ఆంటోనీ, డైరెక్టర్‌తో దిగిన ఫొటోను షేర్ చేశారు.
Similar News
News March 15, 2025
సూపర్ ప్లాన్: ఈ రీఛార్జ్‌తో 365 రోజులు..

తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ యాక్టివ్‌గా ఉండాలనుకునే యూజర్ల కోసం BSNL మంచి ప్లాన్ అందిస్తోంది. రూ.1,198తో రీఛార్జ్ (రోజుకు రూ.3.28) చేస్తే 365 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతి నెలా 300 నిమిషాల వరకు ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాలింగ్, 30 ఫ్రీ SMSలతో పాటు నెలకు 3GB డేటా వస్తుంది. దేశమంతటా రోమింగ్ సమయంలో ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్ పొందొచ్చు. BSNLను సెకండ్ సిమ్‌గా ఉపయోగించేవారికి ఇది బెస్ట్ ప్లాన్.
News March 15, 2025
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్నాం: మంత్రి ఉత్తమ్

TG: ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి (RLIP) కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇది తమ సర్కారు సాధించిన విజయమని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం అంతర్రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించి RLIP నిర్మాణం చేపట్టిందని కేంద్రం వద్ద తాను వాదనలు వినిపించానని చెప్పారు. దీన్ని అడ్డుకోకుండా ఉండి ఉంటే కృష్ణా పరివాహకంలో దుర్భర పరిస్థితి ఏర్పడేదన్నారు.
News March 15, 2025
నటి రన్యా రావు తండ్రిపై ప్రభుత్వం చర్యలు!

బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరులో పట్టుబడిన కన్నడ నటి రన్యా రావు కేసులో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆమె సవతి తండ్రి, హౌసింగ్ కార్పొరేషన్ DGP రామచంద్రారావును సెలవుల్లో పంపింది. ఆయన స్థానంలో కె.వి.శరత్ చంద్రను నియమించింది. మరోవైపు రన్యారావు బెయిల్ పిటిషన్‌ను ఈడీ న్యాయస్థానం తిరస్కరించింది. ఈ సందర్భంగా తనను కొట్టి తెల్ల కాగితాలపై పోలీసులు సంతకాలు చేయించుకున్నారని రన్యా రావు ఆరోపించారు.