News October 7, 2024
22, 23 తేదీల్లో విజయవాడలో డ్రోన్ సమ్మిట్

AP: విజయవాడలో ఈ నెల 22, 23 తేదీల్లో అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్ జరగనుంది. డ్రోన్ల తయారీ సంస్థలు, ఐఐటీలు, ఐఐఎస్‌సీల నుంచి దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. 22న కృష్ణా తీరంలో 5వేల డ్రోన్లతో భారీ ప్రదర్శన జరుగుతుంది. సదస్సులో సీఎం చంద్రబాబు కూడా పాల్గొంటారు. విస్తృతమైన ప్రజా వినియోగానికి వీలుగా డ్రోన్లను తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
Similar News
News December 12, 2025
డిజిటల్ రూపంలో జనాభా లెక్కలు: అశ్వినీ వైష్ణవ్

2027 జనగణన నిర్వహణకు ₹11,718 కోట్లను కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. డేటా రక్షణను దృష్టిలో ఉంచుకుని జనాభా లెక్కల సమాచారం ఇకపై పూర్తిగా డిజిటల్ రూపంలోనే ఉంటుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 2027 జనాభా లెక్కలు మొట్టమొదటి డిజిటల్ జనాభా లెక్కలు అవుతాయన్నారు. 2దశల్లో జనాభా లెక్కలు నిర్వహిస్తారని వివరించారు. ముందు గృహాల గణన, జాబితా తయారీ, ఆపై జనగణన ఉంటుందన్నారు.
News December 12, 2025
విష్ణువు మన కోర్కెలు ఎలా తీరుస్తాడు?

భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః|
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః||
పరమాత్ముడైన విష్ణుమూర్తి దీప్తిమంతుడు. ప్రకాశవంతుడు. ఆయన సహనశీలి. సృష్టిలో మొదటగా జన్మించింది ఆయనే. పాప రహితుడు, అనఘుడు, విజయాన్ని సైతం జయించేవాడు కూడా ఆయనే. ఇంతటి గొప్ప భగవంతుడైన ఆ దశావతార మూర్తికి మన కోర్కెలు తీర్చడం అసాధ్యమే కాదు. అందుకే ఆయనను ధ్యానిస్తే కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News December 12, 2025
చాపకింద నీరులా విస్తరిస్తోన్న సెకండరీ ఇన్‌ఫర్టిలిటీ

రెండో సారి గర్భం దాల్చలేకపోవడాన్ని సెకండరీ ఇన్‌ఫర్టిలిటీ. ప్రస్తుతం దీని తీవ్రత ఎక్కువగా ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. యూరోపియన్ సొసైటీ ఫర్ హ్యూమన్ రీప్రొడక్షన్ అండ్ ఎంబ్రియాలజీ 2021లో చేసిన ఒక అధ్యయనంలో ప్రపంచవ్యాప్తంగా 20 శాతం జంటలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. మహిళల్లో వయసు పెరిగిపోవడంతో పాటు ఎండోమెట్రియోసిస్, ట్యూబల్ బ్లాక్, ఓవేరియన్ సిస్ట్ వంటివి దీనికి కారణమని చెబుతున్నారు.


