News August 29, 2024
నమీబియాలో కరవు.. ఏనుగుల మాంసం పంచనున్న ప్రభుత్వం

ఆఫ్రికాలోని నమీబియాలో తీవ్ర కరవు నెలకొంది. అక్కడి ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకటం లేదు. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 723 అరుదైన అడవి జంతువులను చంపి వాటి మాంసాన్ని ప్రజలకు అందించాలని భావించింది. 300 జీబ్రాలు, 100 బ్లూవైల్డ్ బీస్ట్లు, 83 ఏనుగులు, 60 అడవి దున్నలు, 50 ఇంఫాలాలు, 30 నీటి గుర్రాలను వధించనున్నారు. కాగా నమీబియాలో 14 లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారని ప్రభుత్వ అంచనా.
Similar News
News November 19, 2025
భూ బాధితులకు ఉద్యోగాలు తప్పనిసరి: ఎంపీ కావ్య

కాజీపేటలోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి పరిశీలించారు. యూనిట్ పనుల్లో జాప్యం లేకుండా చూడాలని, భూములు కోల్పోయిన స్థానికులకు ఉద్యోగాలు తప్పనిసరిగా కల్పించాలని ఆమె సూచించారు. ఉద్యోగాల అంశంపై గతంలో కేంద్ర రైల్వే మంత్రిని కలిసినట్లు గుర్తుచేస్తూ, పార్లమెంట్లో కూడా గళం వినిపిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.
News November 19, 2025
నేషనల్-ఇంటర్నేషనల్ న్యూస్ రౌండప్

* గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్కి 11 రోజుల NIA కస్టడీ విధించిన పటియాలా కోర్టు
* భారత్ నుంచి షేక్ హసీనాను రప్పించేందుకు ఇంటర్పోల్ సహాయం తీసుకోవాలని యోచిస్తున్న బంగ్లాదేశ్
* టెర్రర్ మాడ్యూల్ కేసులో అల్ ఫలాహ్ వర్సిటీకి సంబంధించి వెలుగులోకి కీలక విషయాలు.. ఛైర్మన్ జావద్ సిద్దిఖీ కుటుంబీల కంపెనీలకు రూ.415 కోట్లు అక్రమంగా తరలించినట్లు గుర్తించిన ED
News November 19, 2025
30ఏళ్ల పాత కారుకు రూ.10లక్షలు ఆఫర్.. ఎందుకంటే?

కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి తన కెరీర్ తొలినాళ్లలో కొన్న మారుతి 800 కారును తిరిగి పొందేందుకు ఇన్స్టాలో భారీ ఆఫర్ ఇచ్చారు. కారు ఎక్కడుందో కనుక్కొని తెచ్చిస్తే రూ.10లక్షలు ఇస్తానని చెప్పారు. తాజాగా ఈ కారు ఎక్కడుందో గుర్తించిన కొందరు టోయింగ్ వ్యాన్పై తీసుకొచ్చి ఆయనకు అందించారు. కారును చూసి పొంగిపోయిన ఆయన చెప్పినట్లుగానే రూ.10లక్షల చెక్ అందించారు. 1994లో ఈ కారును రూ.1.10లక్షలకు కొన్నట్లు తెలిపారు.


