News September 7, 2024
దేశవాళీలో DRS.. బీసీసీఐ భేష్: అశ్విన్

ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో బీసీసీఐ DRSను తీసుకురావడంపై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. దీని వల్ల దేశవాళీ క్రికెట్లో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలు కలుగుతుందని ఆయన ట్విటర్లో అభిప్రాయపడ్డారు. యువ క్రికెటర్లు సైతం తమ తప్పుల్ని తెలుసుకుని తమను తాము మెరుగుపరుచుకుంటారని అశ్విన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రికీ భుయ్ తాజాగా ఔటైన విధానాన్ని ఆయన ఉదాహరణగా వివరించారు.
Similar News
News November 24, 2025
ఉక్రెయిన్ కనీస కృతజ్ఞత చూపట్లేదు: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ వార్ ఆపేందుకు US ప్రయత్నిస్తున్నప్పటికీ ‘కీవ్’ కనీస కృతజ్ఞత చూపట్లేదని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు రష్యా నుంచి యూరప్ ఆయిల్ కొంటూనే ఉందని మండిపడ్డారు. US, ఉక్రెయిన్లో బలమైన నాయకత్వం ఉండి ఉంటే ఈ యుద్ధం జరిగేది కాదంటూ జెలెన్స్కీ, బైడెన్లను SMలో విమర్శించారు. అయితే US చేస్తున్న కృషిపై కృతజ్ఞత ఉందని జెలెన్స్కీ తెలిపారు. కాగా ట్రంప్ <<18354785>>‘పీస్ ప్లాన్’పై<<>> చర్చలు కొనసాగుతున్నాయి.
News November 24, 2025
మెనోపాజ్లో ఎముకలు జాగ్రత్త

ప్రతి స్త్రీ జీవితంలో మెనోపాజ్ స్థితి ఒకటి. అయితే ఈ క్రమంలో మహిళల శరీరంలో ఎన్నో మార్పులొస్తాయి. ముఖ్యంగా క్యాల్షియం, డి విటమిన్ లోపాలు ఎముకల్ని బలహీనంగా మారుస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి మెనోపాజ్ దశలో స్త్రీలు తమ రోజువారీ ఆహారంలో సుమారు 1200 మి.గ్రా క్యాల్షియంను అదనంగా తీసుకోవాలి. అలానే, పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లు కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్ ఎక్కువగా ఉండే డైట్ని తీసుకోవాలంటున్నారు.
News November 24, 2025
ఘోర ప్రమాదం.. భయానక ఫొటో

TG: హైదరాబాద్ శామీర్పేట ORR మీద ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో మంటలు చెలరేగి నిమిషాల్లోనే మొత్తం దగ్ధమైంది. కూర్చున్న సీటులోనే డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. అతని అస్థిపంజరం మాత్రమే మిగిలింది. ఇందుకు సంబంధించిన భయానక ఫొటో ఉలికిపాటుకు గురిచేస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. సీట్ బెల్ట్ లాక్ అవడంతోనే డ్రైవర్ బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది.


