News August 10, 2024

డార్క్‌వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్లు.. స్పీడ్ పోస్టులో డెలివరీ

image

స్పీడ్ పోస్టులో డ్రగ్స్ డెలివరీ చేస్తున్న వ్యక్తిని TG పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మంకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జులై 31న డార్క్‌వెబ్‌లో డ్రగ్స్‌ ఆర్డర్ చేశాడు. అతనికి విక్రయదారుడు అస్సాం నుంచి డ్రగ్స్‌ను స్పీడ్ పోస్టులో పంపాడు. ఈ విషయాన్ని నార్కోటిక్ వింగ్ కనిపెట్టింది. దీంతో పోలీసులు నిందితుడిని ఈనెల 8న పట్టుకున్నారు. క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు జరుగుతున్నట్లు గుర్తించారు.

Similar News

News September 15, 2024

రిటైర్మెంట్‌పై స్టార్ స్పిన్నర్ కీలక వ్యాఖ్యలు

image

తన ఆటను మెరుగుపరుచుకోలేదని భావించినప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తానని భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. ఆటకు వీడ్కోలు పలకడం ఎప్పుడనేది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఎలాంటి లక్ష్యాన్ని పెట్టుకోలేదని, దీంతో ఆటపై ప్రేమను కోల్పోదలుచుకోలేదన్నారు.

News September 15, 2024

స్టీల్ ప్లాంట్‌కు బొగ్గు కొరత రాకుండా చూస్తాం: శ్రీనివాస వర్మ

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో బొగ్గు కొరత కారణంగా ఉత్పత్తి నిలిచిపోయిన విషయం కేంద్రం దృష్టికి వచ్చిందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌కు ఇలాంటి సమస్య కొత్తగా వచ్చినది కాదని వ్యాఖ్యానించారు. బొగ్గు కొరత రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వరదలతో నష్టపోయిన ఏపీని కేంద్రం ఆదుకుంటుందని చెప్పారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు.

News September 15, 2024

ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ

image

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. టాటానగర్-పట్నా, బ్రహ్మపూర్-టాటానగర్, రూర్కెలా-హౌరా, డియోగఢ్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా మార్గాల్లో ప్రయాణించే రైళ్లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. వాస్తవానికి ఝార్ఖండ్‌లో ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.