News June 15, 2024
ఒకే రోజు రూ.584 కోట్ల విలువైన డ్రగ్స్‌ను కాల్చేశారు
డ్రగ్స్ రవాణాపై కంబోడియా ఉక్కుపాదం మోపుతోంది. ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో పట్టుబడిన రూ.584 కోట్ల విలువైన 7 టన్నుల మాదక ద్రవ్యాలను ఇటుక బట్టీలో ఉంచి ఒకే రోజు అధికారులు కాల్చేశారు. ఈ ఏడాది మే వరకు 3,800కు పైగా డ్రగ్స్ సంబంధిత కేసులను నమోదు చేసి, దాదాపు 10వేల మందిని అరెస్టు చేసినట్లు వారు వెల్లడించారు. కాగా మనదేశంలోనూ పలుమార్లు రూ.వందల కోట్ల విలువైన డ్రగ్స్‌ను అధికారులు నాశనం చేశారు.
Similar News
News September 17, 2024
MBBS యాజమాన్య కోటా ఆప్షన్ల ఎంపికకు నోటిఫికేషన్
AP: ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2024-25కు గాను యాజమాన్య కోటా(B, C) ఎంబీబీఎస్ సీట్ల ఆప్షన్ల ఎంపికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 19 రాత్రి 9 గంటల వరకు అవకాశం ఉంటుంది. 25 కాలేజీల్లో 1,914 సీట్లుండగా, B కేటగిరీలో 1,318, C(ఎన్నారై) కేటగిరిలో 596 సీట్లు ఉన్నాయి.
వెబ్‌సైట్: <
News September 17, 2024
ఆత్మవిశ్వాసంలో కోహ్లీకి ఎవరూ సాటిరారు: సర్ఫరాజ్ ఖాన్
విరాట్ కోహ్లీ యంగ్ ప్లేయర్లకు ఎప్పుడూ అండగా ఉంటూ విలువైన సూచనలు ఇస్తుంటాడని సర్ఫరాజ్ ఖాన్ ప్రశంసించారు. క్రికెట్ పట్ల ప్యాషన్, ఆత్మవిశ్వాసంలో ఆయనకెవరూ సాటిరారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. IPLలో 2015-18 మధ్య RCB తరఫున కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయనతో కలిసి టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవాలనే తన కల భవిష్యత్తులో నిజమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
News September 17, 2024
న్యూయార్క్‌లో ఆలయం ధ్వంసం.. ఖండించిన భారత కాన్సులేట్
న్యూయార్క్‌లోని స్వామినారాయణ్ ఆలయంలో ఓ భాగాన్ని దుండగులు <<14119738>>ధ్వంసం<<>> చేయడాన్ని అక్కడి భారత కాన్సులేట్ తీవ్రంగా ఖండించింది. ఇది హేయమైన చర్య అని మండిపడింది. నిందితులను అరెస్టు చేసి కఠినచర్యలు తీసుకోవాలని అక్కడి పోలీసులను కోరింది. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని హిందూ అమెరికన్ ఫౌండేషన్ డిమాండ్ చేసింది. ఇటీవల హిందూ సంఘాలకు బెదిరింపులు వచ్చాయని, ఇప్పుడు దాడి జరిగిందని పేర్కొంది.