News September 2, 2024
DRY SKIN: అసలు కారణాలివే
చర్మం పొడిబారడాన్ని Xerosis అంటారు. వాన, చలికాలాల్లో ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంటుంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాతావరణం వేడెక్కినా, చల్లగా ఉన్నా, తేమ తగ్గినా ఇలాగే అవుతుంది. భార రసాయనాలున్న క్లెన్జర్స్, నీటితో ముఖం, చర్మాన్ని ఎక్కువ సార్లు కడిగినా సమస్య తప్పదు. మేనిపై తేమను పెంచి కాపాడేది సెబమ్. చర్మగ్రంథులు దాన్ని తక్కువగా స్రవించినా పొడిబారడం ఖాయం. సిగరెట్లు తాగినా ఈ ముప్పు తప్పదు.
Similar News
News September 13, 2024
టీడీపీ ఖాతాలోకి జగ్గయ్యపేట మున్సిపాలిటీ
AP: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వైసీపీకి షాక్ తగిలింది. మున్సిపల్ ఛైర్మన్ రాఘవేంద్రతో పాటు పలువురు కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి నారా లోకేశ్ వారికి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికలతో జగ్గయ్యపేట మున్సిపాలిటీ టీడీపీ కైవసం అయింది. వైసీపీ సిద్ధాంతాలు, జగన్ విధ్వంసక విధానాలు నచ్చక వారంతా టీడీపీలో చేరారని ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య అన్నారు.
News September 13, 2024
కేసీఆర్ అంటే నాకెప్పటికీ గౌరవమే: ఎమ్మెల్యే అరెకపూడి
TG: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రౌడీలా మాట్లాడటం వల్లే తాను నోరు జారానని కాంగ్రెస్ MLA అరెకపూడి గాంధీ అన్నారు. ‘మహిళల్ని అవమానించేలా కౌశిక్ మాట్లాడారు. ప్రాంతీయ విభేదాలు తెచ్చారు. KCR అంటే నాకెప్పటికీ గౌరవమే. ఆయన మమ్మల్ని ఆదరించారు. కౌశిక్ వంటి చీడపురుగులు ఉంటే KCR గొప్ప మనస్తత్వానికి, గతంలో మేం చేసిన సేవలకు, పార్టీకి మచ్చ వస్తుంది. అలాంటి వాళ్ల వల్లే అధికారం కోల్పోయాం’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.
News September 13, 2024
Stock Market: అప్రమత్తంగా ఇన్వెస్టర్లు
బెంచ్‌మార్క్ సూచీలు నేడు మోస్తరు నష్టాల్లో ముగిశాయి. ఆరంభం నుంచి రేంజుబౌండ్లోనే కదలాడాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, సూచీలు గరిష్ఠాలకు చేరడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. BSE సెన్సెక్స్ 71 పాయింట్లు నష్టపోయి 82,890 వద్ద ముగిసింది. NSE నిఫ్టీ 32 పాయింట్లు తగ్గి 25,356 వద్ద స్థిరపడింది. బజాజ్ ట్విన్స్ అదరగొట్టాయి. ఎస్బీఐ లైఫ్, అదానీ పోర్ట్స్, HDFC లైఫ్ టాప్ లూజర్స్.