News June 29, 2024

అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు

image

TG: మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని CS శాంతికుమారిని సీఎం సూచించారు. రేపు డీఎస్ అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో డి.శ్రీనివాస్ మంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు.

Similar News

News December 5, 2025

హోమ్ లోన్ EMIపై ఎంత తగ్గుతుందంటే?

image

RBI రెపో రేటును తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతమిచ్చిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ తగ్గింపుతో బ్యాంకులు వడ్డీ రేట్లను సవరిస్తాయంటున్నారు. ఫలితంగా గృహ, వాహన రుణాలపై నెలవారీ ఈఎంఐలు తగ్గి రుణగ్రహీతలకు ఉపశమనం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకున్న వారికి నెలకు దాదాపు రూ.3,000 నుంచి రూ.4,000 వరకు భారం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.

News December 5, 2025

అవాంఛిత రోమాలు ఎక్కువగా వస్తున్నాయా?

image

అమ్మాయిల్లో అవాంఛిత రోమాలు ఎక్కువగా రావడాన్ని హిర్సుటిజం అంటారు. ముందు దీనికి చికిత్స తీసుకుని ఆ తర్వాత వెంట్రుకల పెరుగుదలను ఆపడానికి ప్రయత్నించాలంటున్నారు నిపుణులు. వెంట్రుకలు తొలగించడానికి పర్మనెంట్‌ హెయిర్‌ లేజర్‌ రిడక్షన్ ట్రీట్‌మెంట్‌ చేస్తుంటారు. అయితే హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారికి ఎక్కువ సెషన్లు తీసుకోవాల్సి వస్తుంది. మూల కారణాన్ని తెలుసుకుంటే సెషన్ల సంఖ్యను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

News December 5, 2025

మరో సంచలన లేఖ విడుదల చేసిన మావోయిస్టులు

image

వికల్ప్ పేరుతో మావోయిస్టులు మరో సంచలన లేఖ విడుదల చేశారు. దేవ్‌జీ సహా మల్లా రాజిరెడ్డి తమతోనే ఉన్నారని పేర్కొన్నారు. లొంగిపోవడానికి వాళ్లు ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని తెలిపారు. హిడ్మా సమాచారాన్ని దేవ్‌జీ పోలీసులకు చెప్పారన్నది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. అతడి హత్యకు నలుగురు వ్యక్తులే కారణమని లేఖలో వెల్లడించారు. కోసాల్ అనే వ్యక్తి అతడి హత్యకు ప్రధాన కారణమని మావోయిస్టులు ఆరోపించారు.