News June 29, 2024

అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు

image

TG: మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని CS శాంతికుమారిని సీఎం సూచించారు. రేపు డీఎస్ అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో డి.శ్రీనివాస్ మంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు.

Similar News

News December 1, 2024

CM రేవంత్‌కు మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి సవాల్

image

TG: మాజీ సీఎం KCRకు వెయ్యి ఎకరాల్లో ఫామ్‌హౌస్ ఉందని CM రేవంత్‌ చేసిన వ్యాఖ్యలను BRS మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఖండించారు. KCRకు వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఉన్నట్లు తేలితే తాను MLA పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఒకవేళ నిరూపించలేకపోతే రేవంత్‌రెడ్డి ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. తనతో వస్తే KCR ఫామ్‌హౌస్ చూపిస్తానని రేవంత్‌కు ప్రశాంత్‌రెడ్డి ఆఫర్ చేశారు.

News December 1, 2024

ALERT.. కాసేపట్లో వర్షం

image

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 గంటల్లో మోస్తరు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, ఖమ్మం, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లో చిరుజల్లులు కురిసిన సంగతి తెలిసిందే.

News December 1, 2024

రూ.10 కోసం పోలీసులకు ఫిర్యాదు!

image

రూ.10 బాకీ పడిన మనిషి ఆ మొత్తాన్ని ఇవ్వడం లేదని ఓ వ్యక్తి పోలీసుల్ని ఆశ్రయించిన ఆసక్తికర ఘటన ఇది. UPలోని హర్దోయ్ ప్రాంతానికి చెందిన జితేంద్ర పాన్ షాప్ నడుపుకుంటున్నారు. సంజయ్ అనే కస్టమర్ ఏడాదిన్నర క్రితం గుట్కా ప్యాకెట్ కొని రూ.10 అరువు పెట్టాడు. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదని విసిగిపోయిన జితేంద్ర, పోలీస్ హెల్ప్‌లైన్ 112కి ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి సంజయ్ నుంచి రూ.10ని జితేంద్రకి ఇప్పించారు.